Wednesday, March 24, 2010

పిల్లల కోసం పెద్దల కవిత్వం

పిల్లల కోసం పెద్దల కవిత్వం


(పచ్చిమ గోదావరి జిల్లా ,పెదపాడు మండలం,కోర్లమ్మకుంట ,ఎం.పి.పి .స్కూలు వార్షికోత్సవం లో చెప్పిన స్వీయ కవిత-తేది: 18.03.2010)


"మేమంతా..."

                 -శ్రీ 'కాట్రగడ్డ' 


పిల్లలం !పిల్లలం !పిల్లలం !
అక్షరాలూ నేర్చుకొనే ఎల్లలం !ఎవరి పిల్లలం!
అందమైన పిల్లలం !మంచి మనసు మల్లెలం!
పిల్లలం! పిల్లలం!మేమంతా బడి  పిల్లలం!

            కనుల చూసి-చెవుల వినగా 
             తెలుగు భాష శిక్షితులం ;
            మొక్కలపై మక్కువతో 
            విత్తనాలు వెదజల్లే రక్షకులం!

అమ్మ,నాన్న ,ప్రేమాలోదుగు
మాటలుగా-పాటలుగా,
అక్షరాలూ నేర్చి కూర్చి
పోటిపడి ఆటలాడు పిల్లలం!! 

             లక్షణ గురువులకై శిష్యులం!
             బాలురకు,బాలికలకు స్నేహితులం!
             మాబడిలో మార్మోగే నవ్వులం;
             గుడిలాంటి మా బడి లో దివ్వెలం!!

మేమంతా తెలుగు తల్లి పిల్లలం 
తెలుగు దేశ నలుదిక్కుల 
మారడుగు లేయ ఎదుగుచున్న
చదువులమ్మ పోషణలో పిల్లలం!

              పిల్లలం! పిల్లలం! పిల్లలం!
              ఆంధ్రాక్ష రాల హారతులిడు  పిల్లలం!
              అందమైన గ్రామాన భారతీయ ముల్లెలం!
              పిల్లలం! పిల్లలం!మేమంతా బడి  పిల్లలం!


********         ********        ******** 


              బాలల్లారా...


            శ్రీ  గుడిసేవ విష్ణు ప్రసాద్ ,ది.   24.03.2010 

బాలల్లారా  మీరు బాగుగా చదువుచు 
మంచి నడవడి కను మాసాలు కొనిన 
జగతి  మెచ్చు మీకు జయము కలుగుచుండు 
'బాల కళ 'కు కవిత పంప రండి 

**********           *************



           రంగులు !రంగులు!!

                                     -తాతా రమేశ్ బాబు 



రంగులు రంగులు రంగులు 
రా  చిలకా వేసెద రంగులు 
ముక్కుకు  ఎరుపు  రెక్కకు పచ్చా 
చక్కగా  నేను పూసెద రంగులు!! 


                రంగులు రంగులు రంగులు 
                ఓ కాకి పూసెద రంగులు 
                అంతా నలుపూ  కళ్ళే తెలుపూ 
                చిక్కగా రంగులు పులిమెద  నీకు !! 
రంగులు రంగులు రంగులు 
ఇడుగిడిగో బుదుగూ గాడు
చొక్కా లేదుగా  లాగూ నలుపు 
తప్పవు నీకు రంగులు నేడు!!


                 రంగులు రంగులు రంగులు 
                 పుస్తకాలలో బొమ్మలు గీసి 
                 గీసిన బొమ్మకు రంగులు వేసి 
                 చిత్రకారుడను ఆవుదును తప్పక !!


**********         **********


           అక్షర మాల 

                   -గంటా సాధు సుభాకర రావు , సెల్:9248175140
                        హెచ్ .ఎం .,ఎం.పి.పి.స్కూల్ ,
                        సేరిదగ్గుమిల్లి .గుడ్లవల్లేరు మండలం 





  
మ్మ పెట్టిన తాయిలంతో 
నందంగా బడి కెళ్ళాను 
క్కడ అక్కడ 
లలు వేస్తూ 
రకలు వేస్తూ 
యల ఉడతల కథలే వింటూ 
ణమో పణమో ఏమీ తెలియక
ఋ   అని దీర్ఘం తీస్తూ 
రుపు,నలుపు,పసుపు ,తెలుపు 
డు రంగుల ఆటలు ఆడి
దు ఆరు ఒకట్లు చెప్పి 
ప్పుల కుప్ప ఆటలు ఆడి 
డల ఒంటెల కథలే వింటూ 
రా   అని ఆశ్చర్యం తో 
ఆం తా ఎంతో సంతోషించి 
ఆః  అంటూ మురిసిపోయాము 
లము కావాలని మారాం  చేస్తే 
ర్జురపు పండు నాన్నే ఇస్తే 
బగబా తిని నే 
ణ ఘణ ఘణ ఘణ గంటలు మోగగా 
జ్ఞ  అంటూ దీర్ఘం తీస్తూ 
క చక బడికి 
లో అంటూ 
తగా కూడి
మ్మని పోయి
ఇణి మాస్టారు రాస్తే 
క్కున నేను 
పామని శబ్దం చేశా 
ప్పుల మోతల్లె 
మాల్  డమాల్ అని గ 
గణ గంట మొగంగా 
లుపు తోసుకుని 
పా తపాయని 
బ్బున నేను
న ధన చప్పుడు 
డకల
రుగుల పసందులతో
స్టున నేను 
యటకు వెళ్లి 
లే భలే 
న మంచి బడి 
ని 
య్యిన నేను 
య గా జతగా 
డివడి గా బయటకు వెళ్లి  మా బడికి 
లవు   వద్దు గిలవూ వద్దని సంతో 
ముగా గంతులు వేసి 
రదాగా ఆటలు ఆడి 
మ్మని హుమ్మని గ
మెత్తి అ 
క్షర దీపం నాలోవెలగగా 
య్యిన నేను ఇంటికి పోయా ! 
(ది. 04 .04 .2010 )


**********          ***********
శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ రచన 
ది .05 .04 .2010


 

తల్లి జిజియా భాయి తనయ శివాజీ కి 
మంచి మంచి కథలు చెప్పి 
దేశభక్తి నేర్పి దేశాన్ని రక్షించే 
అట్టి తల్లి నీకు అవసరమ్ము 


**********            ***********


Sunday, March 21, 2010

బాల "కథ"

 బాల "కథ"





                          ఓ కథ

 
                       - యస్.కె.కాశింబి                                                                                            4 వ  తరగతి, NSC ప్రాథమిక పాఠశాల,
                   త్రిపురాంతకం



                                
                       



                        

                  ఒక ఊరిలో రాము అనే అబ్బాయి వుండేవాడు. ఆ అబ్బాయి నాలుగవ తరగతి
చదువుతున్నాడు. రోజూ బడికి వెళ్ళేటపుడు బడి దగ్గర ఏదైనా కొనుక్కోవడానికని
వాళ్ళ అమ్మ ఒక రూపాయో, రెండు రూపాయలో ఇస్తూ వుండేది. అతను ప్రతి రోజూ
ఇంట్లో యిచ్చిన డబ్బులన్నిటికీ కొనుక్కోకుండా కొంత డబ్బుకు కొనుక్కొని ,
మరి కొంత డబ్బును  బడిలో సారు దగ్గర వాళ్ళ ఇంట్లో తెలియకుండా  " సంచయిక"
లో దాచుకునే వాడు. అలా దాదాపు రూ.210/- ల వరకూ పొదుపు చేసుకున్నాడు.                                                                                            ఒక
రోజు వాళ్ళ ఇంటికి వాళ్ళ మామయ్య వచ్చాడు. రామును దగ్గరకు తీసుకొని బాగా
చదువుతున్నావా అల్లుడూ! అని అడిగాడు. బాగా చదువుతున్నాను మామయ్యా !
అన్నాడు. రామును రకరకాల ప్రశ్నలు అడిగాడు. అన్నిటికీ చక్కగా సమాధానం
చెప్పినందుకు, మెచ్చుకుంటూ రాముకు నచ్చిన  సినిమా చూపించడమే గాకుండా,
ఇరవై రూపాయలు బహుమతిగా కూడా ఇచ్చి వెళ్ళాడు. ఒక్కసారి అంత డబ్బు
వచ్చేసరికి , రాము మరల రోజు బడికి రాగానే, తనకు బాగా ఇష్టమైన ఐస్
క్రీములు 15 రూపాయలకు కొనుక్కుని తిన్నాడు. దాంతో తెల్లవారేసరికి వాడికి
బాగా జలుబు చేసి, జ్వరం కూడా వచ్చింది. వాళ్ళ అమ్మ వాళ్ళు బాగా బీదవాళ్ళు
అవడంతో డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళడానికి డబ్బులు   లేక బాధ పడుతుంటే,
రాము నా దగ్గర వున్నాయని చెప్పాడు. వాళ్ళ నాన్న  నీకు డబ్బు ఎక్కడిది రా
అన్నాడు. రోజూ నాకు కొనుక్కోడానికి మీరు నాకు ఇచ్చే దానిలో కొంత సారు
దగ్గర పొదుపులో దాచుకుంటున్నానని చెప్పాడు. అపుడు వాళ్ళ నాన్న చాలా
సంతోషపడి సారుకు చెప్పి ఆ డబ్బులు తెచ్చాడు. డాక్టరుకు చూపించాడు. రాముకు
జ్వరం తగ్గింది. రాము తెలివితేటలను డాక్టరు కూడా మెచ్చుకున్నాడు.
అదేవిధంగా చల్లని పదార్ధాలను అంత అతిగా తినకూడదని చెప్పాడు. రాము
ఇంకెప్పుడూ అంత ఎక్కువగా ఐస్ క్రీం లు తినలేదు.




 నీతి: డబ్బు దాచుకోవడం వలన మనకే ఉపయోగపడతాయి


(ఈ కథ ను పంపిన వారు శ్రీ మద్దిరాల శ్రీనివాసులు, ఉపాధ్యాయుడు , త్రిపురాంతకం dt,31.03.2010 )






                                             ఎగిరే గుర్రం
                       (ఈ కథ ను 5 వ తరగతి లో రాసాడు )
                               -తాతా వెంకటేశ్వర రావు ,8 వ తరగతి  







        అనగనగా ఒక రాజు వున్నాడు. ఆ రాజు కు ఒక కొడుకు .అతనిపేరు వెంకి . రాజు తన కుమారునికి  ఒక  గుర్రాన్ని బహుమతి గా ఇచ్చాడు .
             అది ఒక వింత గుర్రం .ఆ గుర్రం ఎక్కి కాలితో తన్నితే ఆకాశం లోకి ఎగురు తుంది .
             రాజ కుమారుడి విద్య అభ్యసించటానికి గురుకులానికి వెళతాడు.
             ఈ గుర్రాన్ని తోటమాలి కొడుకు చాటుగా చూస్థూ ఉంటాడు.
             ఒక రోజు రాకుమారుడు గురుకులం కు వెళ్ళిన సమయంలో తోట మాలి కిదుకు గుర్రం మీద ఎక్కి ఆకాశం లోకి వెళ్ళాడు. అప్పుడు ఆకాశం నుండి కిందికి చూసినతోటమాలి కొడుకు గుర్రం ని ఒక్క తన్ను తన్నాడు. అప్పుడు అది క్రిందికి దిగింది . తోటమాలి కొడుకు రాజు ఇంటి ముందు గుర్రాన్ని వుంచి వెళ్లి తన తండ్రి దగ్గర కూర్చున్నాదు.ఒక రోజు రాజ కుమారుడు విద్య నభ్యసించి త్వరగా ఇంటికి వస్తుండగా,దారి మధ్యలో ఆకాశ మార్గమున తోరమాలి కిదుకు తన తండ్రి గారు బహుకరించిన గుర్రం పై విహారిస్తుండటం రాజకుమారుడు చూసాదు. రాజకుమారుడు ఆ గుర్రాన్ని వెంబడించాడు.
           తోటమాలి కొడుకు ఆ గురాన్ని రాజు ఇంటి ముందు పెట్టి తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఈ విషయం రాజు గారికి తెలిసింది. రాజు గారు తోరమాలి కిడుకును కొట్టి ఇంకా  ఎప్పడు తన కుమారుని వస్తువులు తీయ వద్దని పంపించి వేసాడు.
           తన కుమారుడు ఇలా చేసినందుకు టోర మాలి బాధ పడ్డాడు.
           ఆ రోజు నిద్రలో తోటమాలి కుమారుడు రాజు తిట్టినా తిట్లన్నీ మర్చి పోయాడు .ఆతరువాత రాజ కుమారుడు,తోటమాలి కొడుకు మంచి మిత్రులయ్యారు.

Wednesday, March 17, 2010

* ఇతర" బాలకళ" లు

తొడుగు బొమ్మల ను తయారు చేయించిన తరువాత విద్యార్ధులు వేదిక మీద ప్రదర్శిస్తున్న దృశ్యం 








అంతర్జాతీయ సంస్థ ఎ.ఎస్.ఏం. ప్లాన్ ,కృష్ణ -ఆధ్వర్యం లో సృజనాత్మకత పై విద్యార్ధుల కు శిక్షణ ను తాతా రమేశ్ బాబు ఇస్తున్న దృశ్యం . వేదిక మీద సంస్థ బాద్యులు








                                                           
                                                                                                                                                          
                                                           

ఆర్ధిక సమతా మండలి ఆధ్వర్యం లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న తాతా రమేశ్ బాబు



గుడివాడ ఎ.జి.కే.పురపాలక ఉన్నత పాటశాల లో విద్యార్థులకు స్క్రీన్ ప్రింటింగ్ లో శిక్షణ ఇస్తున్న తాతా రమేశ్ బాబు -2002 సం.లో

శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ పంపిన క్రింది రెండు చిత్రాలు ,ది.20 .03 .2010 -


జిల్లా పరిషద్ ఉన్నత పాటశాల ,భావదేవరపల్లి,కృష్ణా జిల్లా









'జై సమైక్యాంధ్ర ' అనే నినాదాన్ని తెలియ చెస్థూ విద్యార్థులను ఆంధ్ర ప్రదేశ్  ఆకారం లో అమర్చిన ఉపాధ్యాయులు
భావదేవరపల్లి,   జడ్ .ఫై.హెచ్.ఎస్.-

*బాల "చిత్రకళ"

శ్రీ మద్దిరాల శ్రీనివాసులు అఫ్సర్ అనే విద్యార్థిని గీసిన చిత్రాలను జత చేసారు
ది.౧౭.౦౪.౨౦౧౦
















































చిన్నారి' అఫ్సర్ '




ఎ.జి.కే.పురపాలక ఉన్నత పాటశాల విద్యార్ధులు చిత్రించిన గ్రీటింగు కార్డులు






గుడివాడ పురపాలక సంఘం మరియు కళా వనరుల కేంద్రం ఆధ్వర్యం లో ఆరు ఉన్నత పాటశాల లలో ని విద్యార్థులకు గ్రీటింగ్ కార్డు ల చిత్రీకరణ కార్య శాలలో చిత్రించిన కార్డులు
మున్సిపల్ కమీషనర్ ,చైర్మన్,తాతా రమేశ్ బాబు





శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ పంపిన రెండు చిత్రాలు-ది .20 .03 .2010



కృష్ణా జిల్లా ,దివిసీమ లోని భావదేవరపల్లి జిల్లా పరిషద్ ఉన్నత పాటశాల లో ని విద్యార్ధి గీసిన స్వామి వివేకానంద చిత్రం
పంపినది :శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్






విద్యార్థులు చే చిత్రాలు గీయిస్తున్న శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్






చిత్రం : తాతా వెంకటేశ్వర రావు ,8 వ తరగతి



Saturday, March 13, 2010

మా గురించి

                 బాల బాలికల లో నిబిడీకృత మయిన సృజనాత్మక శక్తులను బయటకు తీసుకు రావడమే "బాల కళ" లక్ష్యం. కవిత్వం,చిత్రలేఖనం ,గానం,నృత్యం,మొదలయిన కళలలో విద్యార్థులు సృష్టించినవి   ప్రచురించటానికి వేదికగా "బాల కళ" ను రూపు దిద్దాలనే తపన తో ఏర్పడింది "బాల కళ" .
                 పిల్లలను ప్రోత్సహించే  ఎవరయినా ఇందులో భాగస్వాములు కావచ్చు . అలాంటి వారి పేర్లను ఇందులో ప్రకటిస్తాము. పిల్లలను ప్రోత్సహించడానికే "బాల కళ" ఆవిర్భవించింది.
                 ఇందులో భాగ స్వాములు అవటానికి అందరికీ ఆహ్వానం


                                         గౌరవ సలహాదారు :
                              పి.చంద్రశేఖర ఆజాద్ ,హైదరాబాద్
                           email :chazadp @rediffmail .com





                                       

                                             సంపాదకుడు
                                        
                                         తాతా రమేశ్ బాబు

Friday, March 12, 2010

*బాల ' కవితా' కళ

        




వికృత నామ సంవత్సర ఉగాది బాలల కవి సమ్మేళనం లో పాల్గొన్న చిన్నారులు.
నిర్వహణ: తాతా రమేశ్ బాబు







                   మార్చ్ పదమూడో తేది సాయంత్రం గుడివాడ స్టేషన్ రోడ్ లో గల 'బొమ్మరిల్లు' ప్రాంగణం లో 'వికృతి' నామ సంవత్సర ఉగాది బాలల కవి సమ్మేళనం జరిగింది . పదిహేను మంది చిన్నారులు తమ కవితా గానం చేసారు. ఆ తరువాత 'బాల కళ' అంతర్జాల పత్రిక ను ఆవిష్కరించటం జరిగింది.
               ఇందుకు సంబందించిన వార్తలను పద్నాలుగో తేది న ఈనాడు దినపత్రిక జిల్లా అయిదవ పేజి ,ప్రజా శక్తీ దినపత్రిక జిల్లా నాలుగవ పేజిలో ,ఆంధ్ర జ్యోతి దినపత్రిక పదిహేనవ పేజి లో ,సూర్య దినపత్రిక జిల్లా తొమ్మిదవ పేజి లో, ఆంద్ర భూమి దినపత్రిక జిల్లా నాలుగవ పేజి లో ,వార్త దినపత్రిక పడవ పేజి లో నూ ప్రచురించారు. వీరికి 'బాల కళ" ధన్యవాదాలు తెలుపుతోంది.
             ఈ ఉగాది కవి సమ్మేళనం లో పదమూడు మంది చిన్నారులు పాల్గొని తమ కవితా గానం చేసారు.
              వారి కవితలను యదాతదంగా ఇక్కడ ప్రచురిస్తున్నానu .దర్శించండి.అభిప్రాయాలు క్రింది  పెట్టెలో చెప్పండి.










                     "అందరి ఉగాది "

                                -కుమారి జేబు శ్వేత ,ఎనిమిదవ తరగతి


మా పండుగ ఉగాది
ఉగాది మా పండుగ
అంటారు అందరు
మన పండుగ అనరెందుకు?


ఉగాది పండుగ -అందరి పండుగ


మరచిపోయిన రుచులను
గురుతు చేసే పండుగ
మరచిపోకూడదు మనం
పిల్లలమూ ,పెద్దలమూ


ఉగాది పండుగ -అందరి పండుగ


పెద్దల సమస్యలు తీరాలి
పిల్లల చదువుల గెలవాలి
అందరం సంతోషం గా
కలకాలం హాయిగా వుండాలి


ఉగాది పండుగ-అందరి పండుగ


ప్రొద్దున్నే నిద్ర లేచి
ఎంచక్కా తలమ్తుకొని
ధగ ధగ లాడే దుస్తులు
ధరించి జరిపే పండుగ


ఉగాది పండుగ -అందరి పండుగ




****** ****** ******




                     "సృష్టి కి చెట్టు అందం "


                                        -కుమారి వేలగాడ పార్వతి ,ఎనీదవ తరగతి


వేప చెట్టుకు వేపపువ్వు అందం
వేపపువ్వు ను చేదుగా తిందాం
ఆకుల తోరణాలు గుమ్మానికి అందం
మామిడి కాయను పుల్లగా తిందాం


పూవులు కోసి దేవుడికి పెడదాం
తీపి కోరికలు దేవుడుకి చెప్పుకుందాం
చిన్ని పక్షుల గూళ్ళు
చెట్టుకు నిలయం


వాన వస్తే పచ్చని చెట్టు
తడవనివ్వని గొడుగు


చెట్టు మనకి ఇస్తుంది
చెట్టు మనకి ఇల్లు ఇస్తుంది
చెట్టు మనకి దారి చూపుతుంది


ఇన్ని మంచి పనులు చేసే చెట్టును
నరికి వేస్తారు ఎందుకని?


పచ్చని చెట్లు పచ్చని పైరు
సృష్టి కి మూలమ్ చెట్లు అందం




***** ****** *******




          "ఎందుకోసం?"


                       -వి.నీలిమ ,తొమ్మిదవ తరగతి




పువ్వు వేచింది దేవుడు కోసం
నెమలి వేచింది నాట్యం కోసం
పావురం వేచింది శాంతి కోసం
నేను వేచింది దేశప్రగతి కోసం
నేడు అందరూ
వేచింది ' వికృతి ' కోసం


****   *****    ******                                                                        


       " పిల్లల గమ్యం?" 




                             -శీలం వాసవి,ఎనిమిదవ తరగతి




కొంతమంది పిల్లలు
రోడ్ల పైనా ,హొటల్లలొనూ
పని చేస్తారు ఎందుకని ?
మరి కొంతమంది పిల్లలు
కారుల్లోను ,బంగాలాల లొనూ
వున్నారు ఎందుకని?
అసలు పిల్లలంటే
ఆదుతూ,పాదుతూ,చదువుతూ
వుండాలని అంటారు పెద్దలు
ఈ తేడా లెండుకని?

***  ****  ****


 


              "తస్మాత్ జాగ్రత్త"


                              -చవల లతాశ్రి,ఎనిమిదవ తరగతి


రోజు గడిస్తే
రాలిపోయేది పుష్పం
గాలి వీస్తే
ఆరిపోయేది దీపం
మెలకువ వస్తే
చెదిరిపోయేది స్వప్నం
తప్పు చేస్తే
పోయేది జీవితం


ఎన్నటికి
ఆదకూదదు అబద్దాలు
ఎప్పటికీ
చెయకూదదు  తప్పులు
ఎలాగో
బ్రతకాలి నిజాయతేగా
ఎదగాలి
జీవితంలో గొప్పగా


మరచిపొకూదదు
చదువు గొప్పతనం
మరివకూదదు
తల్లి దైవమని
తిరిగి రాదు
రోజు ఎన్నటికి
గుర్తించు
మంచి ఎప్పటికి


*****      *****    *******  


 


         "ఆకాశ పరిమళం "


                             - స్రవంతి ,తొమ్మిదవ తరగతి 


ఆకాశం లో చినుకును మరువను
చినుకు ఇచ్చే పరిమళాన్ని మరువను
మనస్సు లోని మమతను మరువను
మన ప్రగతికి బాటలు వేసే మాస్టార్ని మరువను


**********        ***********     *********




       'ఉగాది పచ్చడి"


                 -చుక్కా నాగ దుర్గా ప్రసాద్,ఎనిమిదో తరగతి


వికృత ఉగాది వచ్చింది
ఆరు రుచులను తెచ్చింది
మామిడి పండు లోని పులుపు
అది తిన్న వారికే తెలుసు


ఆరు రుచులు ఆరు ఋతువులు
ఒక్క లాగే వుంటాయి
అన్ని రకాల బాధలు
ఆరు తో పోవాలి


ఉగాది పచ్చడి లోని రుచి మధురం
చెరుకు గడ తీపి అమృతం
వేప పువ్వు చేదు తిందాం
ఈ పచ్చడే ఒక అద్భుతం !

**********       *********      **********




                ''అసలైన అందం"


                            -పెరుపోగు మాధవి,ఎనిమిదో తరగతి.




వేప చెట్టు కి వేపపూవు అందం
మామిడి చెట్టు కి మామిడి కాయ అందం
అరటి చెట్టు కి అరటి కాయ అందం
పిల్లలందరికీ  చదువు కుంటేనే అందం


*********       **********       *********


                     "అమ్మ "


                                -నాగిరెడ్డి హేమలత,ఎనిమిదవ తరగతి.


అమ్మ పిలుపు
కోకిలమ్మ పిలుపు
అమ్మ చీర
ముద్దా బంతి పూవు
అమ్మ గుప్పెడంత
బిడ్డలు గంపెడంత
మీ అమ్మ పేరు ఏమిటి?
అనడుగు తారు ఎవరైనా
అన్నిటి కన్నా
అమ్మ పేరే మిన్న

********       ***********      ********

                     "అమ్మ-చదువు"


                             -నగిరేడ్డి హేమలత ,ఎనిమిదో తరగతి.


అమ్మ అంటే నా కిష్టం
నేనంటే అమ్మ కి ఇష్టం
అమ్మ ప్రేమ మధురం
అమ్మ మాట మిటాయి


అమా దేముడు లాంటిది 
అమ్మ వెలుగు లాంటిది
అమ్మ చదువు లాంటిది

*********         *********       *********


                   ఉగాది 


                  -భోగాది ఝాన్సి
                   జి.ప.ఉన్నత పాటశాల, భావదేవర పల్లి.






ఉగాది,ఉగాది,ఉగాది,
యుగ యుగంబుల ఆది 
తెలుగు సంస్క్రుతికి పునాది 
రుచులను ఇచ్చే ఉగాది 


ఉప్పు,పులుపు,కారం
చేదు ,తీపి,వగరు 
ఆరు రుచుల ఉగాది 
సుఖ దుఖ్ఖాల ఉగాది 

(ఈ కవితను చిన్నారి చే రాయించి పంపినవారు శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ ,24 -03 -2010 )

 

**********          ***********     **********


మాఅమ్మ



అల్లరి చేస్తే అరుస్తుంది.
ఆకలేస్తే అన్నం పెడుతుంది
కోపం వస్తే కొడుతుంది.
తప్పులు చేస్తే తంతుంది.
నిద్దరొస్తే జోకొడుతుంది.
ఏడుపొస్తే ఎత్తుకొంటుంది
అప్పుడు ఐస్ క్రీం కొనిస్తుంది.

 
                     రచన: తరుణ్, NSC పాఠశాల, త్రిపురాంతకం



(ఈ కవితను రాయించి పంపించిన వారు శ్రీ మద్దిరాల శ్రీనివాసులు,   ది. 29 .03 .2010 )
**********             ***********





         బాలలం 
                   -భోగాది లహరి,

                            జి.ప.ఉన్నత పాటశాల, భావదేవర పల్లి.




బాలలం  బాలలం 
భావి జగతి పాలకులం 
బాలలం  బాలలం 
బాగుగ చదివే బాలలం 

          ఆటలు బాగా అడేదము
          పాటలు బాగా పాడెదము 
          బిమ్మలు బాగా గీసేదము 
          అల్లరి బాగా చేసెదము 

************            ************

మిగిలిన కవితలు తరవాత పోస్ట్ చేస్తాను