Monday, August 20, 2012

స్పాట్ పెయింటింగ్ మరియు ఆధునిక ,సాంప్రదాయ వాయిద్యాల పోటి




స్పాట్ పెయింటింగ్ మరియు ఆధునిక ,సాంప్రదాయ వాయిద్యాల పోటి లో పాల్గొని ,మీ చిన్నారులను పాల్గొనేలా ప్రోత్సహించి ................సృజనాత్మకత ను వెలికి తీసి .................
అందరికి ఆహ్వానం.
చిత్రకళా సేవలో ....
తాతా రమేశ్ బాబు 

Tuesday, July 24, 2012

"అమెరికా అబ్బాయి-గుడివాడ అమ్మాయి" చిత్రలేఖనం

అమెరికా అబ్బాయి-గుడివాడ అమ్మాయి  చిత్రలేఖనం
అమెరికా,  వాషింగ్ టన్ లో పుట్టి పెరిగిన కృష్ణ జిల్లా గుడివాడ అక్కినేని కళాశాల కోశాధికారి శ్రీ కాట్రగడ్డ సింహాద్రి అప్పారావు మనుమడు, ప్రణవ్ రామ . వాషింగ్ టన్ లోనే డాన్ స్టన్ ఎలిమెంటరీ పాటశాల లో 1 వ స్టాండర్డ్ చదువు తునాడు. తన 8 సం. వయసులో చకచక బొమ్మలు గీస్తున్నాడు.
గుడివాడ వచ్చిన ఈ అమెరిక అబ్బాయికి చిత్ర లేఖనం లో శిక్షణ ఇమ్మని అడిగారు.
ప్రణవ్ రామ గీస్తున్న దృశ్యాన్ని చూడండి. అతని చెల్లెలు 'మేధ శ్రీ ' కూడా తక్కువ ఏమి కాదు, అన్న ప్రక్కన కూర్చుని తన 5 సం. వయసులో బొమ్మలు గీస్తోంది .
                                                                    ప్రణవ్ రామ,మేధ శ్రీ






ప్రణవ్ రామ గీసిన బొమ్మ 





ఇది ఇలా వుండగా నేను చిత్రలేఖన ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న పాటశాల లో వున్న  ఎలిమెంటరీ స్కూల్ లో జూన్ 22,2012 న 1 వ తరగతిలో చేరిన 'రేగిడ ప్రవల్లిక ' ఇంకా అక్షరాలు కూడా నేర్వకనే బొమ్మలు గీస్తోంది .చూడండి ఆ బొమ్మని .




 

Friday, July 13, 2012

ఒక బుల్లి మరియు వికలాంగ చిత్రకారులు

                         ఒక బుల్లి మరియు వికలాంగ చిత్రకారులు
                     మా పాటశాల ఆవరణలో ఎలిమెంటరీ పాటశాల కూడా వుంది. అక్కడ ప్రదాన ఉపాధ్యాయులు శ్రీ మల్లవల్లి అమ్మన్న బాబు. వీరు మా పాటశాల పూర్వ విధ్యార్దే ! విద్యార్థులను చిత్రలేఖనం లో ప్రోత్సహిస్తూ గీయించిన చిత్రం చూడండి. విద్యార్ధి పేరు 'గరికే  బాలకృష్ణ ' . చదువుతున్నది 3 వ తరగతి .




               
                  అలాగే మా పాటశాలలో 7 వ తరగతి  విద్యార్థి  'అబ్బూరి ఎలియా ' . నేను బోర్డు మీద గీసిన చిత్రాన్ని వేస్తున్నాడు. ఈ విద్యార్ధికి మాటలు రావు, మన మాటలు వినపడవు.



Wednesday, July 11, 2012

ఏకాగ్రతగా బొమ్మ గీస్తున్న దృశ్యం

ఏకాగ్రతగా బొమ్మ గీస్తున్న దృశ్యం
మా పాటశాల లో 6  వ తరగతి చదువుచున్న విద్యార్ధి ' పెయ్యల ప్రకాష్ ' . ఈ రోజు నేను బోర్డ్ మీద గీసిన 'మర్రి ఆకు ' బొమ్మను చాలా ఏకాగ్రతగా గీస్తున్నాడు. చూడ ముచ్చట గా వుంది ఆ దృశ్యం. వెంటనే ' క్లిక్ '. ఆ పైన ఇక్కడ మీ కోసం. ఈ అబ్బాయికి మీ అభిప్రాయం తెలియ చేయండి.


Friday, July 6, 2012

సాన్వి ఆజాద్ గ్రీటింగ్

సాన్వి ఆజాద్ గ్రీటింగ్
మే 24 , ప్రముఖ రచయిత  పి . చంద్ర శేఖర  ఆజాద్ పుట్టిన  రోజు .
 ఇటివల ''ఎదురీత'  సీరియల్ లో నటించే సందర్భం లో .వారింటికి వెళ్లాను .  ఆజాద్ మనవరాలు , ఆజాద్  పుట్టిన రోజు కి స్వయంగా తయారు  చేసిన గ్రీటింగ్  చూసాక , అది ఇక్కడ పెట్టాలని పించింది .

గ్రీటింగ్ లోపల పేజీ


ఈ చిన్నారి కి మీ ఆభిప్రాయం చెప్పండి 

Sunday, May 13, 2012

'నాన్నోయ్ పులి ' పప్పెట్ షో -తాతా రమేష్ బాబు



                                 'నాన్నోయ్ పులి '  పప్పెట్ షో
                
ఇది దూరదర్శన్ లో ప్రసారమయినది.బొమ్మలు ఆడించి             ,సంభాషణలు పలికినది నేనే. మీ అభిప్రాయం చెప్పండి.

-తాతా రమేష్ బాబు 

Sunday, May 6, 2012

'బాటసారి-బంగారు కంకణం ' చివరి భాగం



'బాటసారి-బంగారు కంకణం ' చివరి భాగం 
ప్రతి స్పందన కోసం ఎదురు చూస్తూ .........

Thursday, May 3, 2012

'బాటసారి-బంగారు కంకణం ' 3 వ భాగం

'బాటసారి-బంగారు కంకణం ' 3 వ భాగం
చిన్ని నేస్తాలు , చూస్తున్నారు కదా... 
                                                      
                                                      మీ అభిప్రాయాలు ఇందులో రాస్తారా ?

    మీ సృజనలు పంపితేనే నాకు ఆనందం!

Monday, April 30, 2012

బాటసారి -బంగారు కంకణం, 2 వ భాగం

బాటసారి -బంగారు కంకణం, 2 వ భాగం 
అందరికి నమస్కారం.
'బాల కళ ' -బాల బాలికలలో నిబిడీకృతమైన సృజన శక్తిని వెలికి తీయడం కోసం ఏర్పాటు చేశాను . ఈ వేసవి లో కొన్ని విడియో లు అప్లోడ్ చేస్తాను. దయచేసి  మీ పిల్లలకు చూపించండి . మీ పిల్లలు ప్రదర్శించే కళలకు సంబందించిన ఫోటోలు కానీ విడియో లు కానీ నాకు మెయిల్ చేస్తే ,అప్లోడ్ చేస్తాను. ఇది పిల్లల బ్లాగు . ఇందుకు పెద్దలు సహకరించాలి. 
పప్పెట్ షో రెండవ భాగం ఇస్తున్నాను. 
మీ అభిప్రాయం తో పాటు,ముఖ్యంగా మీ పిల్లల అభిప్రాయం రాయండి.
                                                          
                                                        చిట్టి నేస్తాలకు మరోసారి స్వాగతం.

ఈ బొమ్మలు కదిలించింది, సంభాషణలు చెప్పింది నేనే . విడియో తీసింది చి. తాతా వెంకటేశ్వర రావు  

Sunday, April 29, 2012

చిన్నారులూ, ఈ వేసవి సెలవులను ఎలా గడుపుతారు?

చిన్నారులూ,  ఈ వేసవి సెలవులను ఎలా గడుపుతారు? 'బాల కళ' కి రాసి పంపండి. 
ఇక్కడ ఒక విడియో ఇస్తున్నాను. చూడండి. మీ అభిప్రాయం చెప్పండి. మీ మనసులో వున్నది నిర్భయంగా రాయటానికి వెనుకాడ వద్దు. 
ఇక్కడ ఇచ్చిన ఈ విడీయో 'కథ' పేరు.... 
'బాటసారి-బంగారు కంకణం '
      దురాశ దుక్కానికి చేటు -అనే సామెత విన్నారా? ఒక క్రూర జంతువు మాటలు నమ్మి ఆశ పడిన బాటసారి గతి ఏమయిందో ఈ బొమ్మలాటలో చూడండి.
 [ఓ అడవిలో మిట్ట మధ్యహ్నం వేళ ఓ బాటసారి ప్రయాణిస్తున్నాడు]

 


తరువాయి భాగం మరో రోజు..............


ఈ విడియో తీసిన చిన్నారి  తాతా వేంకటేశ్వర రావు

 

Thursday, April 26, 2012

సాన్వి ఆజాద్ బొమ్మలు

సాన్వి ఆజాద్ బొమ్మలు :
          ప్రముఖ రచయిత , నటుడు, పి. చంద్ర శేఖర ఆజాద్ మనవరాలు 'సాన్వి ఆజాద్ ' . ఈ పాప కు బొమ్మలు వేయడం, డాన్సు చేయడం, నూతనత్వం గా ఆలోచించడం పుట్టుక తోనే అబ్బాయి .  ఆంగ్లం,హిందీ, తెలుగు భాషలలో మాట్లాడే  ఈ చిన్నారి  వేసిన కొన్ని బొమ్మలు చూడండి. మీ అభిప్రాయం చెప్పండి. 


Wednesday, April 25, 2012

ఈ బొమ్మ ఎవరు వేసినది ?

                                                                  


                                                          ఈ బొమ్మ ఎవరు వేసినది ?