Wednesday, May 5, 2010

వేసవి విచిత్రం-వింత వీడియో

చిన్నారులూ,
మీరంతా వేసవి శెలవుల్ని ఆనందంగా,విజ్ఞాన దాయకంగా ,వినోదంగా,కళాత్మకంగా గడపాలని కోరుకొంటున్నాను.
మీ నేస్తం చి.తాతా వెంకటేశ్వర రావు తయారు చేసిన "విచ్చుకొనే పువ్వు " వీడియో ను ఇక్కడ ఇస్తున్నాను. చూడండి.ఎలా వుందో చెప్పాలి మరి.... ఇలాంటివి మీరు తయారు చేస్తే ,వెంటనే బాల కళ కు పంపండి.


ఇది తయారు చేయటం చాలా తేలిక .మీలో చాలామందికి తెలుసుకదా.
తయారు చేయటం రానివారు కుడా వుంటారు . తయారు చేయాలని వుందా? క్రింది బాక్సు లో రాయండి......



Saturday, May 1, 2010

పొడుపు కథలు

క్రింది పొడుపు కథలు సేకరించిన వారు పి.రచన ,ఏడవ తరగతి.


ఒకటి:

మిమ్మల్ని
ఎండ నుంచి
వాన నుంచి
రక్షించ లేని
గోడుగుని
ఎవరు నేను ?

జవాబు : గుడుగో ట్టపు
రెండు:


రెండు అంగుళాల గదిలో
అరవై మంది దొంగలు
తల,మొండం ఉన్నాయి కానీ
కాళ్ళు,చేతులు లేవు
ఎవరు వాళ్ళు ?

జవాబు : లుల్లపు లోట్టే పెగ్గి


మూడు:

అడ్డంగా కొస్తే
చక్రాన్నవుతా
నిలువుగా కొస్తే
శంఖాన్నవుతా
ఎలా కోసినా
నిన్నేడిపిస్తా
ఎవరు నేను?

జవాబు: యపాల్లి

క్రింది పొడుపు కథలు సేకరించిన వారు చిన్నారి కె.మౌనిక,ఏడవ తరగతి

ఒకటి:


తల ఒకటే కాని
చేతులు మూడుంటాయి
నేనెవరో చెప్పు కొండి?

జవాబు: ముర యాడి


రెండు:


నాట్యం చేస్తాను కానీ
నాట్య కత్తెను కాను
ఒళ్లంతా కళ్ళే కాని
రెండింటి తోనే చూస్తాను
నా పేరేంటి?
జవాబు :లిమనే


మూడు:


దేహమంత కళ్ళు కానీ
దేవేంద్రుడుని కాను
నరుడి సాయం లేక పొతే
ఎటూ నడవ లేను
ఎవరు నేను?

జవాబు: లవ


నాలుగు:


ఒళ్ళు వేడెక్కితే
గటగట నీళ్ళు తాగేస్తాను
కాస్త చల్ల బడితే చాలు
గొల్లున ఏడ్చేస్తాను
ఇంతకీ నేనెవరు?

జవాబు: బ్బు