Tuesday, July 24, 2012

"అమెరికా అబ్బాయి-గుడివాడ అమ్మాయి" చిత్రలేఖనం

అమెరికా అబ్బాయి-గుడివాడ అమ్మాయి  చిత్రలేఖనం
అమెరికా,  వాషింగ్ టన్ లో పుట్టి పెరిగిన కృష్ణ జిల్లా గుడివాడ అక్కినేని కళాశాల కోశాధికారి శ్రీ కాట్రగడ్డ సింహాద్రి అప్పారావు మనుమడు, ప్రణవ్ రామ . వాషింగ్ టన్ లోనే డాన్ స్టన్ ఎలిమెంటరీ పాటశాల లో 1 వ స్టాండర్డ్ చదువు తునాడు. తన 8 సం. వయసులో చకచక బొమ్మలు గీస్తున్నాడు.
గుడివాడ వచ్చిన ఈ అమెరిక అబ్బాయికి చిత్ర లేఖనం లో శిక్షణ ఇమ్మని అడిగారు.
ప్రణవ్ రామ గీస్తున్న దృశ్యాన్ని చూడండి. అతని చెల్లెలు 'మేధ శ్రీ ' కూడా తక్కువ ఏమి కాదు, అన్న ప్రక్కన కూర్చుని తన 5 సం. వయసులో బొమ్మలు గీస్తోంది .
                                                                    ప్రణవ్ రామ,మేధ శ్రీ






ప్రణవ్ రామ గీసిన బొమ్మ 





ఇది ఇలా వుండగా నేను చిత్రలేఖన ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న పాటశాల లో వున్న  ఎలిమెంటరీ స్కూల్ లో జూన్ 22,2012 న 1 వ తరగతిలో చేరిన 'రేగిడ ప్రవల్లిక ' ఇంకా అక్షరాలు కూడా నేర్వకనే బొమ్మలు గీస్తోంది .చూడండి ఆ బొమ్మని .




 

Friday, July 13, 2012

ఒక బుల్లి మరియు వికలాంగ చిత్రకారులు

                         ఒక బుల్లి మరియు వికలాంగ చిత్రకారులు
                     మా పాటశాల ఆవరణలో ఎలిమెంటరీ పాటశాల కూడా వుంది. అక్కడ ప్రదాన ఉపాధ్యాయులు శ్రీ మల్లవల్లి అమ్మన్న బాబు. వీరు మా పాటశాల పూర్వ విధ్యార్దే ! విద్యార్థులను చిత్రలేఖనం లో ప్రోత్సహిస్తూ గీయించిన చిత్రం చూడండి. విద్యార్ధి పేరు 'గరికే  బాలకృష్ణ ' . చదువుతున్నది 3 వ తరగతి .




               
                  అలాగే మా పాటశాలలో 7 వ తరగతి  విద్యార్థి  'అబ్బూరి ఎలియా ' . నేను బోర్డు మీద గీసిన చిత్రాన్ని వేస్తున్నాడు. ఈ విద్యార్ధికి మాటలు రావు, మన మాటలు వినపడవు.



Wednesday, July 11, 2012

ఏకాగ్రతగా బొమ్మ గీస్తున్న దృశ్యం

ఏకాగ్రతగా బొమ్మ గీస్తున్న దృశ్యం
మా పాటశాల లో 6  వ తరగతి చదువుచున్న విద్యార్ధి ' పెయ్యల ప్రకాష్ ' . ఈ రోజు నేను బోర్డ్ మీద గీసిన 'మర్రి ఆకు ' బొమ్మను చాలా ఏకాగ్రతగా గీస్తున్నాడు. చూడ ముచ్చట గా వుంది ఆ దృశ్యం. వెంటనే ' క్లిక్ '. ఆ పైన ఇక్కడ మీ కోసం. ఈ అబ్బాయికి మీ అభిప్రాయం తెలియ చేయండి.


Friday, July 6, 2012

సాన్వి ఆజాద్ గ్రీటింగ్

సాన్వి ఆజాద్ గ్రీటింగ్
మే 24 , ప్రముఖ రచయిత  పి . చంద్ర శేఖర  ఆజాద్ పుట్టిన  రోజు .
 ఇటివల ''ఎదురీత'  సీరియల్ లో నటించే సందర్భం లో .వారింటికి వెళ్లాను .  ఆజాద్ మనవరాలు , ఆజాద్  పుట్టిన రోజు కి స్వయంగా తయారు  చేసిన గ్రీటింగ్  చూసాక , అది ఇక్కడ పెట్టాలని పించింది .

గ్రీటింగ్ లోపల పేజీ


ఈ చిన్నారి కి మీ ఆభిప్రాయం చెప్పండి