Friday, July 2, 2010

మద్దిరాల వెంకట రాంప్రకాష్, సహాయం- కథ


పరులకు సహాయం (కథ)
రచన : మద్దిరాల రాంప్రకాష్ , 5 తరగతి ,
NSC పాఠశాల , త్రిపురాంతకం. ప్రకాశం జిల్లా.


ఒకానొకప్పుడు ఒక మనిషి నివసిస్తూ వుండేవాడు. అతని పేరు జాకీ. అతడు ఒక అడవిలో నివసిస్తూ పండ్లు, ఆకులు, గడ్డలు మొ||నవి తింటూ జీవించేవాడు. ఒక రోజు ఆయన తన ఆహారం కోసం అడవిలో తిరుగుతుండగా, ఒక పెద్ద చెట్టుపైన దండిగా పండ్లు కనపడ్డాయి. వాటిని తిని తన ఆకలిని తీర్చుకుందామని చెట్టు ఎక్కసాగాడు. ఇంతలో చెట్టుపైనుండి ఏదో పక్షుల శబ్దం వినపడింది. ఏమిటా ! అని తల పైకెత్తి చూశాడు. చెట్టు పైన వున్న పక్షి గూటిలోని పిల్లలు భయంతో అరుస్తున్నట్లు జాకీకి అర్ధమయ్యింది. చూస్తే గూటికి కొంచెం దూరంలో ఒక పాము గూటి వైపే వస్తూ కనపడింది. జాకీ వెంటనే పాము పక్షి పిల్లలను తినటానికి వెళుతుందన్న విషయం గ్రహించాడు. ఎలాగైనా పక్షి పిల్లలను కాపాడి తీరాలనుకున్నాడు. వెంటనే ప్రక్కన చెట్టు కొమ్మను ఒక చిన్న దానిని విరిచాడు. కర్రతో ఒక్కవేటుతో గురి చూసి పామును కొట్టాడు. అంతే ! పాము చచ్చి క్రింద పడింది. పక్షులు ఎంతో ఆనందంతో కిలకిలలాడాయి. జాకీ కూడా ఎంతో సంతోషించాడు. తరువాత చెట్టు పండ్లను కోసుకొని ఇంటికి వెళ్ళాడు.
చూశారా ! ఫ్రెండ్స్ ! మనం కూడా ఇలాగే ఎవరైనా ఆపదలో వుంటే కాపాడాలి . తెలిసిందా ? చేస్తారు కదూ ? బై ...

No comments:

Post a Comment