
"పుట్టిన రోజు సంతోషం" (పాట)
రచన : యం.వి.తరుణ్ ప్రదీప్, 4 వ తరగతి, మం.ప.ప్ర.పాఠశాల,
త్రిపురాంతకంఎడిటింగ్ : మద్దిరాల శ్రీనివాసులు,
పల్లవి:
ఈ రోజే నీ పుట్టిన రోజూ
ఈ రాజే పుట్టిన రోజూ
ఈ బంగరు రోజూ .....సంతోషపు రోజూ......
చరణం :
కొత్త బట్టలేసే నీ పండుగ రోజూ
కేకు కోసి మిత్రులకూ పంచే రోజూ కొత్త
నీకిష్టమైన పదార్ధాలు పొందే రోజూ
నీ మిత్రులు అందరూ కలిసే రోజూ
నీ బర్త్ డే రోజూ ఈ రోజే
చరణం :
పెద్దలంత నిన్ను దీవించే రోజూ
ఫ్రెండ్సు చేయి కలిపి శుభము పలికే రోజూ పెద్దలంత
మంచి మంచి గిఫ్టులు నీకొచ్చే రోజూ
హ్యాపి బర్త్ డే నీకు పాడే రోజూ
నీ బర్త్ డే రోజూ ఈ రోజే
మంత్ర శాస్త్రము ప్రకారము ఆంగ్లము:
ReplyDeletehttp://donotkeepyourself.blogspot.com/