Saturday, May 4, 2013

'తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ '

నేను నిర్వహించిన తెలుగు జానపద కళా చైతన్య యాత్ర ను 'తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ ' లో నమోదు చేసారు . క్రింది లింక్ లో చూడండి    http://www.telugubookofrecords.com/home/category/find-record/page/5/

Monday, August 20, 2012

స్పాట్ పెయింటింగ్ మరియు ఆధునిక ,సాంప్రదాయ వాయిద్యాల పోటి
స్పాట్ పెయింటింగ్ మరియు ఆధునిక ,సాంప్రదాయ వాయిద్యాల పోటి లో పాల్గొని ,మీ చిన్నారులను పాల్గొనేలా ప్రోత్సహించి ................సృజనాత్మకత ను వెలికి తీసి .................
అందరికి ఆహ్వానం.
చిత్రకళా సేవలో ....
తాతా రమేశ్ బాబు 

Tuesday, July 24, 2012

"అమెరికా అబ్బాయి-గుడివాడ అమ్మాయి" చిత్రలేఖనం

అమెరికా అబ్బాయి-గుడివాడ అమ్మాయి  చిత్రలేఖనం
అమెరికా,  వాషింగ్ టన్ లో పుట్టి పెరిగిన కృష్ణ జిల్లా గుడివాడ అక్కినేని కళాశాల కోశాధికారి శ్రీ కాట్రగడ్డ సింహాద్రి అప్పారావు మనుమడు, ప్రణవ్ రామ . వాషింగ్ టన్ లోనే డాన్ స్టన్ ఎలిమెంటరీ పాటశాల లో 1 వ స్టాండర్డ్ చదువు తునాడు. తన 8 సం. వయసులో చకచక బొమ్మలు గీస్తున్నాడు.
గుడివాడ వచ్చిన ఈ అమెరిక అబ్బాయికి చిత్ర లేఖనం లో శిక్షణ ఇమ్మని అడిగారు.
ప్రణవ్ రామ గీస్తున్న దృశ్యాన్ని చూడండి. అతని చెల్లెలు 'మేధ శ్రీ ' కూడా తక్కువ ఏమి కాదు, అన్న ప్రక్కన కూర్చుని తన 5 సం. వయసులో బొమ్మలు గీస్తోంది .
                                                                    ప్రణవ్ రామ,మేధ శ్రీ


ప్రణవ్ రామ గీసిన బొమ్మ 

ఇది ఇలా వుండగా నేను చిత్రలేఖన ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న పాటశాల లో వున్న  ఎలిమెంటరీ స్కూల్ లో జూన్ 22,2012 న 1 వ తరగతిలో చేరిన 'రేగిడ ప్రవల్లిక ' ఇంకా అక్షరాలు కూడా నేర్వకనే బొమ్మలు గీస్తోంది .చూడండి ఆ బొమ్మని .
 

Friday, July 13, 2012

ఒక బుల్లి మరియు వికలాంగ చిత్రకారులు

                         ఒక బుల్లి మరియు వికలాంగ చిత్రకారులు
                     మా పాటశాల ఆవరణలో ఎలిమెంటరీ పాటశాల కూడా వుంది. అక్కడ ప్రదాన ఉపాధ్యాయులు శ్రీ మల్లవల్లి అమ్మన్న బాబు. వీరు మా పాటశాల పూర్వ విధ్యార్దే ! విద్యార్థులను చిత్రలేఖనం లో ప్రోత్సహిస్తూ గీయించిన చిత్రం చూడండి. విద్యార్ధి పేరు 'గరికే  బాలకృష్ణ ' . చదువుతున్నది 3 వ తరగతి .
               
                  అలాగే మా పాటశాలలో 7 వ తరగతి  విద్యార్థి  'అబ్బూరి ఎలియా ' . నేను బోర్డు మీద గీసిన చిత్రాన్ని వేస్తున్నాడు. ఈ విద్యార్ధికి మాటలు రావు, మన మాటలు వినపడవు.Wednesday, July 11, 2012

ఏకాగ్రతగా బొమ్మ గీస్తున్న దృశ్యం

ఏకాగ్రతగా బొమ్మ గీస్తున్న దృశ్యం
మా పాటశాల లో 6  వ తరగతి చదువుచున్న విద్యార్ధి ' పెయ్యల ప్రకాష్ ' . ఈ రోజు నేను బోర్డ్ మీద గీసిన 'మర్రి ఆకు ' బొమ్మను చాలా ఏకాగ్రతగా గీస్తున్నాడు. చూడ ముచ్చట గా వుంది ఆ దృశ్యం. వెంటనే ' క్లిక్ '. ఆ పైన ఇక్కడ మీ కోసం. ఈ అబ్బాయికి మీ అభిప్రాయం తెలియ చేయండి.


Friday, July 6, 2012

సాన్వి ఆజాద్ గ్రీటింగ్

సాన్వి ఆజాద్ గ్రీటింగ్
మే 24 , ప్రముఖ రచయిత  పి . చంద్ర శేఖర  ఆజాద్ పుట్టిన  రోజు .
 ఇటివల ''ఎదురీత'  సీరియల్ లో నటించే సందర్భం లో .వారింటికి వెళ్లాను .  ఆజాద్ మనవరాలు , ఆజాద్  పుట్టిన రోజు కి స్వయంగా తయారు  చేసిన గ్రీటింగ్  చూసాక , అది ఇక్కడ పెట్టాలని పించింది .

గ్రీటింగ్ లోపల పేజీ


ఈ చిన్నారి కి మీ ఆభిప్రాయం చెప్పండి 

Sunday, May 13, 2012

'నాన్నోయ్ పులి ' పప్పెట్ షో -తాతా రమేష్ బాబు                                 'నాన్నోయ్ పులి '  పప్పెట్ షో
                
ఇది దూరదర్శన్ లో ప్రసారమయినది.బొమ్మలు ఆడించి             ,సంభాషణలు పలికినది నేనే. మీ అభిప్రాయం చెప్పండి.

-తాతా రమేష్ బాబు 

Sunday, May 6, 2012

'బాటసారి-బంగారు కంకణం ' చివరి భాగం'బాటసారి-బంగారు కంకణం ' చివరి భాగం 
ప్రతి స్పందన కోసం ఎదురు చూస్తూ .........

Thursday, May 3, 2012

'బాటసారి-బంగారు కంకణం ' 3 వ భాగం

'బాటసారి-బంగారు కంకణం ' 3 వ భాగం
చిన్ని నేస్తాలు , చూస్తున్నారు కదా... 
                                                      
                                                      మీ అభిప్రాయాలు ఇందులో రాస్తారా ?

    మీ సృజనలు పంపితేనే నాకు ఆనందం!

Monday, April 30, 2012

బాటసారి -బంగారు కంకణం, 2 వ భాగం

బాటసారి -బంగారు కంకణం, 2 వ భాగం 
అందరికి నమస్కారం.
'బాల కళ ' -బాల బాలికలలో నిబిడీకృతమైన సృజన శక్తిని వెలికి తీయడం కోసం ఏర్పాటు చేశాను . ఈ వేసవి లో కొన్ని విడియో లు అప్లోడ్ చేస్తాను. దయచేసి  మీ పిల్లలకు చూపించండి . మీ పిల్లలు ప్రదర్శించే కళలకు సంబందించిన ఫోటోలు కానీ విడియో లు కానీ నాకు మెయిల్ చేస్తే ,అప్లోడ్ చేస్తాను. ఇది పిల్లల బ్లాగు . ఇందుకు పెద్దలు సహకరించాలి. 
పప్పెట్ షో రెండవ భాగం ఇస్తున్నాను. 
మీ అభిప్రాయం తో పాటు,ముఖ్యంగా మీ పిల్లల అభిప్రాయం రాయండి.
                                                          
                                                        చిట్టి నేస్తాలకు మరోసారి స్వాగతం.

ఈ బొమ్మలు కదిలించింది, సంభాషణలు చెప్పింది నేనే . విడియో తీసింది చి. తాతా వెంకటేశ్వర రావు  

Sunday, April 29, 2012

చిన్నారులూ, ఈ వేసవి సెలవులను ఎలా గడుపుతారు?

చిన్నారులూ,  ఈ వేసవి సెలవులను ఎలా గడుపుతారు? 'బాల కళ' కి రాసి పంపండి. 
ఇక్కడ ఒక విడియో ఇస్తున్నాను. చూడండి. మీ అభిప్రాయం చెప్పండి. మీ మనసులో వున్నది నిర్భయంగా రాయటానికి వెనుకాడ వద్దు. 
ఇక్కడ ఇచ్చిన ఈ విడీయో 'కథ' పేరు.... 
'బాటసారి-బంగారు కంకణం '
      దురాశ దుక్కానికి చేటు -అనే సామెత విన్నారా? ఒక క్రూర జంతువు మాటలు నమ్మి ఆశ పడిన బాటసారి గతి ఏమయిందో ఈ బొమ్మలాటలో చూడండి.
 [ఓ అడవిలో మిట్ట మధ్యహ్నం వేళ ఓ బాటసారి ప్రయాణిస్తున్నాడు]

 


తరువాయి భాగం మరో రోజు..............


ఈ విడియో తీసిన చిన్నారి  తాతా వేంకటేశ్వర రావు

 

Thursday, April 26, 2012

సాన్వి ఆజాద్ బొమ్మలు

సాన్వి ఆజాద్ బొమ్మలు :
          ప్రముఖ రచయిత , నటుడు, పి. చంద్ర శేఖర ఆజాద్ మనవరాలు 'సాన్వి ఆజాద్ ' . ఈ పాప కు బొమ్మలు వేయడం, డాన్సు చేయడం, నూతనత్వం గా ఆలోచించడం పుట్టుక తోనే అబ్బాయి .  ఆంగ్లం,హిందీ, తెలుగు భాషలలో మాట్లాడే  ఈ చిన్నారి  వేసిన కొన్ని బొమ్మలు చూడండి. మీ అభిప్రాయం చెప్పండి. 


Wednesday, April 25, 2012

ఈ బొమ్మ ఎవరు వేసినది ?

                                                                  


                                                          ఈ బొమ్మ ఎవరు వేసినది ?

Thursday, September 2, 2010

పుట్టిన రోజు పాత-యం.వి.తరుణ్ ప్రదీప్ ,నాలుగవ తరగతి


"పుట్టిన రోజు సంతోషం" (పాట)


రచన : యం.వి.తరుణ్ ప్రదీప్, 4 వ తరగతి, మం.ప.ప్ర.పాఠశాల,

త్రిపురాంతకంఎడిటింగ్ : మద్దిరాల శ్రీనివాసులు,


పల్లవి:


ఈ రోజే నీ పుట్టిన రోజూ

ఈ రాజే పుట్టిన రోజూ

ఈ బంగరు రోజూ .....సంతోషపు రోజూ......


చరణం :


కొత్త బట్టలేసే నీ పండుగ రోజూ

కేకు కోసి మిత్రులకూ పంచే రోజూ కొత్త


నీకిష్టమైన పదార్ధాలు పొందే రోజూ

నీ మిత్రులు అందరూ కలిసే రోజూ

నీ బర్త్ డే రోజూ ఈ రోజే


చరణం :


పెద్దలంత నిన్ను దీవించే రోజూ

ఫ్రెండ్సు చేయి కలిపి శుభము పలికే రోజూ పెద్దలంత


మంచి మంచి గిఫ్టులు నీకొచ్చే రోజూ

హ్యాపి బర్త్ డే నీకు పాడే రోజూ

నీ బర్త్ డే రోజూ ఈ రోజే

Friday, July 2, 2010

మద్దిరాల శ్రీనివాసులు ,దెయ్యం-కథ

దెయ్యం(కథ)

-మద్దిరాల శ్రీనివాసులు

చిట్టిపల్లె గ్రామంలోని శరత్‌, శ్రావణ్‌ ఇద్దరూ ఇరుగూపొరుగూ పిల్లలు. నాలుగు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కనే వున్న సింగంపల్లెలోని ఉన్నత పాఠశాలలో శరత్‌ 8వ తరగతి, శ్రావణ్‌ 7వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ మంచిమిత్రులు. ఏ పనిచేసినా, ఎక్కడికెళ్లినా దాదాపు కలిసే వుంటారు. వాళ్లిద్దరిలో శ్రావణ్‌ చాలా తెలివైనవాడూ, చురుకైనవాడు. కానీ, కాస్త దుడుకు స్వభావం కలవాడు. శరత్‌ మాత్రం చాలా నెమ్మదస్తుడు. తెలివితో పాటు ఏ విషయాన్నైనా నిదానంగా, తార్కికంగా, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించేవాడు. ధైర్యం కూడా కాస్త ఎక్కువే.

ఒకరోజు వాళ్ల పాఠశాలలోని ఉపాధ్యాయులు, ఆసక్తిగలిగిన మరి కొందరు విద్యార్థులతో కలిసి నాగార్జునసాగర్‌ విహారయాత్రకు వెళ్లారు. వారిలో వీళ్ళిద్దరు కూడా వున్నారు. సాయంత్రం వచ్చేసరికి సూర్యాస్తమయం అయ్యింది. అయినా కాస్త వెలుతురు వుండడంతో చీకటిపడేలోపు పిల్లలను త్వరగా ఇళ్లకు చేరమని చెప్పి, ఉపాధ్యాయులంతా వెళ్లిపోయారు. కానీ, శరత్‌, శ్రావణ్‌ ఇద్దరూ సాగర్‌ విషయాల గురించి చర్చించుకుంటూ నిదానంగా నడవసాగారు. ఇంతలో చీకటిపడ్డ విషయాన్ని గమనించి, వెన్నెల వెలుతురులో వడివడిగా నడవసాగారు. వాళ్ల ఊరు నలభై అడుగుల దూరంలో వుండగా శ్రావణ్‌కు అనుకోకుండా దారిపక్క చింతచెట్టు వైపు చూపుమళ్లింది. వెంటనే ''అమ్మో! దెయ్యం!'' అంటూ శరత్‌ను గట్టిగా పట్టుకున్నాడు. ''ఎక్కడరా?'' అన్నాడు శరత్‌. ''అదిగో! అక్కడ. చూడు'' అంటూ చింత చెట్టుపైకి చూపించాడు.

అక్కడ రెండు చేతులతో కొమ్మలు పట్టుకొని వ్రేలాడుతూ నల్లని ఆకారం ఊగుతూ కనపడింది. తెల్లని కళ్లు మెరుస్తూ వున్నాయి. కనుగుడ్లు మాత్రం లేవు. కానీ, శరత్‌ ఏమాత్రం భయపడకుండా ఒక్కసారి కిందకు పరికించి చూశాడు. కిందివైపు ఒక తోకలాగా వుంది. ఎప్పుడో బడిలో సైన్సుమాష్టారు 'చీకటిలో దేనినైనా చూసినపుడు మన మనసులో ఏదైనా ఆకారాన్ని ఊహించుకుంటే, ఆ ఆకారమే మనకు కనపడుతుంది తప్ప, ఈ దెయ్యాలూ, భూతాలూ వుంటాయని చెప్పేదంతా నమ్మరాదని' చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే శ్రావణ్‌కు ఆ విషయం వివరించి, ధైర్యం చెప్పాడు. 'ఏం భయం లేదు. నాతో రా!' అంటూ శ్రావణ్‌ను పట్టుకొని నెమ్మదిగా అటు చూడకుండా ఇంటికి చేరారు.

ఇంటికి చేరిన వెంటనే శ్రావణ్‌ వాళ్ళ అమ్మకు విషయం చెప్పి, భయంతో 'నేను నీ దగ్గరే పడుకుంటానమ్మా!' అంటూ, గట్టిగా కళ్లు మూసుకొని నిద్రపోయాడు. శరత్‌ మాత్రం ''ఆ ఆకారం ఏమైయుంటుందా?' అని ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం ఇద్దరూ బడికి బయలుదేరారు. దారిలో రాత్రి తాము చూసిన చెట్టును చూశాడు శరత్‌. అంతే ఒక్కసారిగా విరగబడి నవ్వసాగాడు. శ్రావణ్‌కు అర్థంకాక పైకి చూశాడు. వెంటనే అతనికీ నవ్వాగలేదు. అక్కడ చిరిగిపోయిన ఒక పాతగుడ్డ కొమ్మకు తగులుకుని వేలాడుతోంది. పైకి రెండు పీలికలు, కిందికి ఒకటి, మధ్యలో రెండు రంధ్రాలు. బహుశా ఆ రంధ్రాల్లో నుండి వెన్నెల మెరుస్తూ కనబడి వుంటుంది. చూడ్డానికి అచ్చం మనిషి వేలాడబడి, ఊగుతున్నట్లే వుంది. అప్పటి నుండి ఇక జీవితంలో ఎక్కడైనా 'దెయ్యం' వుందన్న మాట వినబడితే చాలు.. పొట్టచెక్కలయ్యేలా విరగబడి నవ్వడమే వీరి పని.

మద్దిరాల వెంకట రాంప్రకాష్, సహాయం- కథ


పరులకు సహాయం (కథ)
రచన : మద్దిరాల రాంప్రకాష్ , 5 తరగతి ,
NSC పాఠశాల , త్రిపురాంతకం. ప్రకాశం జిల్లా.


ఒకానొకప్పుడు ఒక మనిషి నివసిస్తూ వుండేవాడు. అతని పేరు జాకీ. అతడు ఒక అడవిలో నివసిస్తూ పండ్లు, ఆకులు, గడ్డలు మొ||నవి తింటూ జీవించేవాడు. ఒక రోజు ఆయన తన ఆహారం కోసం అడవిలో తిరుగుతుండగా, ఒక పెద్ద చెట్టుపైన దండిగా పండ్లు కనపడ్డాయి. వాటిని తిని తన ఆకలిని తీర్చుకుందామని చెట్టు ఎక్కసాగాడు. ఇంతలో చెట్టుపైనుండి ఏదో పక్షుల శబ్దం వినపడింది. ఏమిటా ! అని తల పైకెత్తి చూశాడు. చెట్టు పైన వున్న పక్షి గూటిలోని పిల్లలు భయంతో అరుస్తున్నట్లు జాకీకి అర్ధమయ్యింది. చూస్తే గూటికి కొంచెం దూరంలో ఒక పాము గూటి వైపే వస్తూ కనపడింది. జాకీ వెంటనే పాము పక్షి పిల్లలను తినటానికి వెళుతుందన్న విషయం గ్రహించాడు. ఎలాగైనా పక్షి పిల్లలను కాపాడి తీరాలనుకున్నాడు. వెంటనే ప్రక్కన చెట్టు కొమ్మను ఒక చిన్న దానిని విరిచాడు. కర్రతో ఒక్కవేటుతో గురి చూసి పామును కొట్టాడు. అంతే ! పాము చచ్చి క్రింద పడింది. పక్షులు ఎంతో ఆనందంతో కిలకిలలాడాయి. జాకీ కూడా ఎంతో సంతోషించాడు. తరువాత చెట్టు పండ్లను కోసుకొని ఇంటికి వెళ్ళాడు.
చూశారా ! ఫ్రెండ్స్ ! మనం కూడా ఇలాగే ఎవరైనా ఆపదలో వుంటే కాపాడాలి . తెలిసిందా ? చేస్తారు కదూ ? బై ...

Wednesday, May 5, 2010

వేసవి విచిత్రం-వింత వీడియో

చిన్నారులూ,
మీరంతా వేసవి శెలవుల్ని ఆనందంగా,విజ్ఞాన దాయకంగా ,వినోదంగా,కళాత్మకంగా గడపాలని కోరుకొంటున్నాను.
మీ నేస్తం చి.తాతా వెంకటేశ్వర రావు తయారు చేసిన "విచ్చుకొనే పువ్వు " వీడియో ను ఇక్కడ ఇస్తున్నాను. చూడండి.ఎలా వుందో చెప్పాలి మరి.... ఇలాంటివి మీరు తయారు చేస్తే ,వెంటనే బాల కళ కు పంపండి.


ఇది తయారు చేయటం చాలా తేలిక .మీలో చాలామందికి తెలుసుకదా.
తయారు చేయటం రానివారు కుడా వుంటారు . తయారు చేయాలని వుందా? క్రింది బాక్సు లో రాయండి......Saturday, May 1, 2010

పొడుపు కథలు

క్రింది పొడుపు కథలు సేకరించిన వారు పి.రచన ,ఏడవ తరగతి.


ఒకటి:

మిమ్మల్ని
ఎండ నుంచి
వాన నుంచి
రక్షించ లేని
గోడుగుని
ఎవరు నేను ?

జవాబు : గుడుగో ట్టపు
రెండు:


రెండు అంగుళాల గదిలో
అరవై మంది దొంగలు
తల,మొండం ఉన్నాయి కానీ
కాళ్ళు,చేతులు లేవు
ఎవరు వాళ్ళు ?

జవాబు : లుల్లపు లోట్టే పెగ్గి


మూడు:

అడ్డంగా కొస్తే
చక్రాన్నవుతా
నిలువుగా కొస్తే
శంఖాన్నవుతా
ఎలా కోసినా
నిన్నేడిపిస్తా
ఎవరు నేను?

జవాబు: యపాల్లి

క్రింది పొడుపు కథలు సేకరించిన వారు చిన్నారి కె.మౌనిక,ఏడవ తరగతి

ఒకటి:


తల ఒకటే కాని
చేతులు మూడుంటాయి
నేనెవరో చెప్పు కొండి?

జవాబు: ముర యాడి


రెండు:


నాట్యం చేస్తాను కానీ
నాట్య కత్తెను కాను
ఒళ్లంతా కళ్ళే కాని
రెండింటి తోనే చూస్తాను
నా పేరేంటి?
జవాబు :లిమనే


మూడు:


దేహమంత కళ్ళు కానీ
దేవేంద్రుడుని కాను
నరుడి సాయం లేక పొతే
ఎటూ నడవ లేను
ఎవరు నేను?

జవాబు: లవ


నాలుగు:


ఒళ్ళు వేడెక్కితే
గటగట నీళ్ళు తాగేస్తాను
కాస్త చల్ల బడితే చాలు
గొల్లున ఏడ్చేస్తాను
ఇంతకీ నేనెవరు?

జవాబు: బ్బు

Wednesday, April 28, 2010

చి. అల్లు సాహితి (రెండవ తరగతి ) చిత్రాలుచిరంజీవి " అల్లు సాహితి "

రెండవ తరగతి చదువుతున్న చిరంజీవి సాహితి ,పెన్సిల్ తో గీసిన బొమ్మలు

Thursday, April 22, 2010

"బాల కళ " లో చి.తాతా వెంకటేశ్వర రావు బొమ్మలకు ,తెలుగు ఫర్ కిడ్స్ డాట్ కాం వారి దృశ్య రూపం

చి .తాతా వెంకటేశ్వర రావు గీసిన " చిట్టి చిలకమ్మా " బొమ్మలకు దృశ్య రూపం .
క్రింది లింకు క్లిక్ చేసి తిలకించండి .
దృశ్య రూపం చేసిన" తెలుగు ఫర్ కిడ్స్ డాట్ కామ్" కు, బాల కళ జేజేలు .
http://www.youtube.com/watch?v=ZWNVtFgGr4s

Monday, April 19, 2010

చి. తాతా వెంకటేశ్వర రావు "చిట్టి చిలకమ్మ"


"చిట్టి చిలకమ్మా "బాలగేయానికి
ఎనిమిదవ తరగతి చదువుతున్న చి.తాతా వెంకటేశ్వర రావు గీసిన బొమ్మలు
చిట్టి
చిలకమ్మా
అమ్మ కొట్టిందా?
ఏడుస్తున్నావా?
వద్దమ్మ వద్దు

తోటలో కెళ్ళావా ?
పండు పట్టవా?
గూట్లో పెట్టొద్దు
గుటుక్కున మింగేయి !!


@@@@@@@@@@ @@@@@@@@@@Saturday, April 17, 2010

శ్రీ మద్దిరాల శ్రీనివాసులు రాసిన బాల కథ

శకునాల గోపయ్య
Share Buzz up! చిన్నారి డెస్కు, ప్రజాశక్తి - మద్దిరాల శ్రీనివాసులు
Sat, 17 Apr 2010, IST

శీనయ్య, గోపయ్య బట్టలను వాయిదా పద్ధతిలో అమ్మే వ్యాపారస్తులు. ఇద్దరూ
మంచిమిత్రులు. అయితే గోపయ్యకు శకునాల పిచ్చి ఎక్కువ. శీనయ్యకు అలాంటి
పట్టింపులు ఏమీలేవు.ఒకసారి ఇద్దరూ కలిసి పట్నం వెళ్లి రకరకాల బట్టలు కొని
తెచ్చుకున్నారు. పల్లెలన్నీ తిరిగి వాయిదాలలో సొమ్ము చెల్లించే విధంగా
బట్టలను అమ్ముకుని వచ్చారు. మరో వారంరోజులకు మిత్రులిద్దరూ మరలా
వ్యాపారానికీ, బాకీ వసూళ్లకి బయలుదేరబోయారు. ఇంతలో ఎవరో ఠపీమని తుమ్మారు.
వెంటనే గోపయ్య, ఛీ! ఛీ! అనుకుంటూ, 'శీనయ్యా! ఎవరో తుమ్మారు, శకునం బాగా
లేదు, కాసేపు ఆగిపోదాములే! వుండు' అన్నాడు.స్నేహితుని మాట కాదంటే
బాధపడతాడని కాసేపు ఆగి ఒకచోట కూర్చున్నారిద్దరూ. కొంచెం సేపయ్యాక మరలా
ఇద్దరూ బయలుదేరబోయారు. కొంతదూరం పోయారో లేదో ఒక వితంతువు ఎదురు వచ్చింది.
వెంటనే గోపయ్య. 'శివ! శివా!' అనుకుంటూ, 'ఒరే! శీనయ్యా! ఇవాళ శకునం
బాగాలేదు గానీ, వ్యాపారానికి రేపు వెళదాం లే!' అన్నాడు. 'ఒరే! గోపయ్యా!
నీకెన్నిసార్లు చెప్పాను. ఇలాంటివన్నీ పట్టించుకోవద్దనీ, ఇవి మన
వ్యాపారానికి మంచిది కాదనీ, పద! బయలుదేరుదాం' అన్నాడు.కానీ, గోపయ్య
వినిపించుకోకుండా, 'నీకూ నేను చాలాసార్లు చెప్పాను. ఇలాంటి శకునాలు
మంచివి కావనీ. అయినా నీ కర్మ!' అంటూ వెనుదిరిగాడు. శీనయ్య మాత్రం
అనుకున్న ప్రకారం వ్యాపారానికి బయలుదేరాడు. సాయంకాలానికల్లా తన బట్టలన్నీ
చక్కగా అమ్ముకోవడంతోపాటు, గత వాయిదాల సొమ్ము కూడా చాలావరకూ వసూలు
చేసుకుని మరీ వచ్చాడు.

తదుపరి వారం ఇద్దరూ కలిసి వ్యాపారానికి బయలుదేరి పోతుండగా ఈసారి దారిలో
ఒక పిల్లి ఎదురైందని 'ఇదేం ఖర్మరా బాబూ!' అనుకుంటూ, 'ఒరే! శీనయ్యా!
ఈసారైనా నా మాట వినరా! పిల్లి ఎదురవడం అస్సలు మంచిది కాదు. ఈరోజుటికి ఆగి
పోదాం, పద' అన్నాడు.

'గోపయ్యా! ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు. పోయినవారం ఇలాగే నీవు వెనుదిరిగావు.
ఏమైంది? నేనేమో, బాకీలు తెచ్చుకున్నాను, బట్టలన్నీ అమ్ముకున్నాను. నా మాట
విని పద! వ్యాపారానికెళ్దాం' అంటూ స్నేహితునికి హితం చెప్పబోయాడు శీనయ్య.

కానీ, గోపయ్య.. 'ఒరే! శీనయ్యా! ఏదో ఒకసారికి నీకు మంచి జరిగి వుండొచ్చు.
కానీ కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. దెబ్బతింటావు జాగ్రత్త! పెద్దల మాట
చద్దన్నం మూట అన్నారు పెద్దలు. కాబట్టి ఈసారైనా నా మాట విని వెనుదిరుగు'
అంటూ కాస్త కోపం కూడా ప్రదర్శించాడు.

ఇక లాభం లేదనుకుని శీనయ్య తన వ్యాపారానికి బయలుదేరాడు. 'పోరా! పో!
అనుభవిస్తావు', అనుకుంటూ ఇంటికి వెళ్లాడు గోపయ్య.

ఇలా అప్పుడప్పుడూ శకునాలతో వెనుదిరగడం గోపయ్యకు పరిపాటి అయ్యిందేగానీ తన
పద్ధతిని మాత్రం మార్చుకోలేదు. దానితో బాకీలు సకాలంలో వసూలుగాక, అప్పులతో
వ్యాపారం చేయాల్సి వచ్చేది. చివరకు దివాళా తీశాడు. మూఢనమ్మకాలు లేని
శీనయ్య మాత్రం మూడుపువ్వులు ఆరుకాయలుగా తన వ్యాపారం చేసుకుంటూ హాయిగా
జీవించసాగాడు.

aptn-1271514559187.jpg
140K View Scan and download
Quick Reply

Tuesday, April 13, 2010

శ్రీ పులవర్తి కోర్నేలియస్ " బాల గేయాలు"

మా వూరు

మాది పల్లెటూరు 
మంచి కదే పేరు 
చల్లని పిల్ల గాలులు 
చెంగు నెగిరే మేకలు 

నల్లనల్లని మబ్బులు 
తెల్ల కొంగల బారులు 
ఆ చెట్లూ ఆ చేమలు 
ఆ పశువులా పచ్చికలు 

ఆ చెరువులా తామరులు 
ఆ ఫలాలు ఆ వనాలూ
ఆ డొంకలు ఆ దారులు 
ఆ పొలాలు ఆ హలాలు 


ఆ జలాలు ఆ జనాలు 
ఆ కేకలు ఆ పిలుపులు 
అవే అవే ఇష్టం 
అవే ఎంతో ఇష్టం 


*********          **********


పల్లె పార్కు 


పల్లెటూరి పొలంలో 
పిల్లలుండే పార్కులో 
మల్లెలెన్నో పిలిచెను 
చెల్లెలా రారమ్ము 


మందారాల తేనెలు 
సన్నజాజుల వాసనలు 
ముద్దా బంతి వూసులు
జాజి పుల విరుపులు 


రామచిలుక చిట్టి పలుకు 
కోయిలమ్మ కూత మెరుపు 
పావురాల కువకువలు 
పాలపిట్ట పదనిసలు 


కాకి చెప్పు తీపి కథలు 
నక్క చెప్పు డాబు కబుర్లు 
పిచ్చుకమ్మ కిచకిచ లు 
గోరువంక రాచనడక


ఎగిరి దూకు ఆటలు 
వింత వింత పాటలు 
జారు బండ ఆటలు 
జోరుగుండు పార్కులో 


బెత్తమసలె పట్టని 
పంతులమ్మ పలుకులో 
చదువు తల్లి రూపము 
ఆమె మాకు దైవము 
అంతా మే మేకము


*********          ***********


బొమ్మలు 


ఎన్నెన్నో బొమ్మలు 
వింత వింత బొమ్మలు 
మా మంచి బొమ్మలు 
మా ఎదుట తిరిగే బొమ్మలు 
ఆట నేర్పే బొమ్మలు 
పాట పడే బొమ్మలు 
కమ్మనైన కథలు చెప్పే 
అవ్వ లాంటి బొమ్మలు 
కబురులాడే బొమ్మలు 
ఖరీదైన బొమ్మలు 
మాసిపోని బొమ్మలు 
వూసులాదె బొమ్మలు 
నడక నేర్పే బొమ్మలు 
వాడిగా పోవు బొమ్మలు 
అలక పడే బొమ్మలు 
ఎన్నెన్నో బొమ్మలు 
మా కిష్టమైన బొమ్మలు


**********          ***********


నేస్తాలు 


ఇల్లు కాయు కుక్కలు 
ఎలుక పట్టు పిల్లులు 
గొర్రె ఉన్ని నిచ్చును 
పలు నిచ్చు గోవులు 
పండ్ల నిచ్చు తరువులు 
మనము పెంచు జిఇవులు
మనకు మంచి దోస్తులు


*********          **********


కుర్రడు


మర్రి నీడ నున్నది 
కర్రియావు చిన్నది 
అర్రు చాచి యున్నది
గుర్రు పెట్టుచిన్నది
కుర్ర ఒకడు మెత్తగా
కర్ర పట్టి తొలగ
గుర్రుగా చూచుచు
చిర్రు బుర్రు లాడుచు
బుర్ర గిర్రు తిప్పగా
తుర్రుమనేను కుర్రడు 

*********           **********

బాబి

బాబి : అమ్మ అమ్మ చూడవే 
           అక్కేమి చేస్తుందో 
           నోట బెట్టి చేతి గోళ్ళు 
           నానబెట్టి కొరుకు చుండే 


తల్లి : తప్పమ్మా చిట్టి తల్లి 
          ఎప్పుదట్లు చేయకు 
         గోటనున్న మట్టి చేరి 
        చేటు తెచ్చి రోగమోచ్చు

అక్క : నాన్న నాన్న చిట్టి చెల్లి 
          సున్న లాగా నోరు తెరచి 
          బాటను వ్రేలు నోటబెట్టి
         నీటుగాను చీకు చుండే 


తండ్రి : అమ్మా నా చిన్న బుజ్జి 
           నోట వ్రేలు పెట్టి చీక 
           కూడ దమ్మ  ఎప్పుడు 
            చాకిలీట్లు నీ కిస్తా  చేగోదిలు తినిపిస్తా 

అక్క,చెల్లి  : ఆమ్మా మేం చెప్పమా 
                   అసలు బాబిగాడి చేష్టలు 
                   బలపాలు చేతబట్టి 
                   బొక్కినాడు నోట యిట్టె 


ఆమ్మా,నాన్న : బాబి బాబి అది నిజామా 
                        బల్ల పెరుగు పొట్టలోన 
                         వూబ పొట్ట వచ్చునయ్య 
                         లాభ ముండ దా పైన 

**********           **********


దినచర్య 


ప్రొద్దున్నే లేస్తా
పళ్లన్నీ తోముతా 
నీళ్ళ జలక మాడుతా 
తలచాక్కగా దువ్వుతా 
పాలన్నీ త్రాగుతా 
పలక చేత బట్టుత
పరుగున బడి కేల్లుతా 
ఆమ్మా ముద్దు తీరుస్తా
నాన్న మాట నిలుపుతా
పదుగురు మెప్పు పొందుతా 

**********          **********


త్రివర్ణ పతాకం 


జై...జై... త్రివర్ణ పతాకకు జై..
కత్తులు దూసుకు పొయినా
నెత్తురు తేరులు పారినా 
ఎత్తిన జండా దింప కోయి  త్రివర్ణ పతాకకు జై..


మూడు వన్నెల మా జండా 
ముచ్చటైన జాతి జండా 
వందకోట్ల భారత జాతి 
గుండెలలో వెలుగు జ్యోతి 


స్వాతంత్రం మా ఊపిరి 
సమభావం మా ప్రాణం 
సిరులకడే సంకేతం 
సమైఖ్యతే దాని రూపు 


సాన్తినే కోరుదాం 
సౌభాగ్యం స్థాపిద్దాం 
సవాలేవారు విసిరినా 
సాహసంతో ఎదిరిద్దాం 


**********          **********


మేమిద్దరం 


అమ్మ,నాన్న యిద్దరుగా 
అక్క నేను ఇరువురము 
పద్దు పెద్దగ పెంచాముగా 
ఒద్దికగా మేముండుముగా
పెద్ద చదువులు చదివేదము 
ముద్దు చేయగా మా వాళ్ళు 


**********           **********

నాన్నలా 


నాన్న లాగే నేను 
నల్ల కోటు వేస్తా 
కాలా జోడు తొడుగుతా
కళ జోడు పెడుతా 
కచేరికి వెళ్ళుతా 
కాగితాలు చూస్తా
మెంచి పనులు చేస్తా 
మా వాళ్ళ పేరు నిలుపుతా

**********          **********


అవ్వ 


అవ్వ మాట మాకు 
తువ్వాయి కేరింతలే 
మువ్వల గల గల మోతలే
గువ్వల కువకువ కుతలే 
తవ్వనున్న రేగిపండ్లు 
యివ్వ నంటూ విసిగిం పులు 
బువ్వమాట మరిచామని 
కవ్వపు చల్ల కలియ బోసి 
రవ్వ లడ్డు చేతి కిచ్చి 
రివ్వున తిన మంటది 

**********          **********

మా ప్రతిభ 

చెట్లలో చేమల్లో రాళ్ళల్లో రాప్పల్లో 
ప్రాణమున్న దంటు ప్రమాణంగా చూపిన 
ప్రాజ్ఞు దెవ్వరు ?జగదీశ్ చంద్ర బోస్ 
మా భారతీయుడు 

గణిత మందు గణుతికెక్కిన 
పూర్ణ స్వారపు రూపు దిద్దిన 
పుణ్య పురుషు దేవ్వరాతాడు ?
భాస్కరుడు మా భారతీయుడు 

గీతాలతో అమ్జలిమ్చి 
గీతంజలినే భువికి నిచ్చి 
నోబెల్ బహుమతినే 
తనదనిపిమ్చిన రవీన్ద్ర 
కవిండ్రు  దేవ్వదాతాడు 
మా భారతీయుడు 

సత్య హింస లాయుధంగా 
సమరామ్గానం సల్పెనాతాడు 
వసుధ పైన ప్రేమ పంచిన 
పసి హృదయు డెవ్వడు ?
బోసి నోటి గాంధీజీ 
మా భారతీయుడు 

పిల్లలన్న గులాబిలన్నాను 
వల్లమాలిన మక్కువతో 
విశ్వశాంతి కి సమిధయై 
శ్వాస విడిచేనే సంత మూర్తి ?
చా చా జవహర్ లాలు
మా భారతీయుడు 

తెలుగు భాషను జనుల భాషగ 
తీర్చి దిద్దిన దీరు దాటాడు
వెలుగు జాడలో తెలుగు తల్లిని 
చెలువ మీరా నడిపించే నాతడే 
గురజాడ మా తెలుగు వాడిగా 

**********          ***********

ప్రశ్నలు

పైకిసిరిన జామపండు 
పడుతుందేం క్రిందికి? 
పైనున్న పక్షి రాజు 
పడిపో డేం క్రిందికి? 

నీటనున్న చేప పిల్ల 
గడుసు మీరా నాడును 
ఒద్దు పడినంతనే
చతికిల బడు నెందుకు?

పూలపైన తుమ్మెద 
గ్రోలుచుండు తేనెలు 
సంపంగె పూలపై
సరసానికి వాల దేల ?


రైలెక్కి వూరబొవ
రకరకాల చెట్లూ చూడ 
రైలు కంటే వేగంగా 
దౌడు తీయు నెక్కడికి?


ఎన్నెన్నో ప్రశ్నలు 
విడదీయని చిక్కు ముళ్ళు 
అన్నిటికీ జవాబులు 
ఆదరంతో చేప్పరేల?


**********          **********


తెలుపు 


మల్లెపూవు తెల్లన 
వెన్నపూస తెల్లన
వెన్నలంత తెల్లన
అమ్మ మనసు చల్లన 


నలుపు 


ఆదిమనసు నల్లన
అసురగుణం నల్లన
కాటుకేంతో నల్లన
కాలుడేంతో నల్లన 


ఎరుపు


మందారం ఎరుపు
మన రక్తం ఎరుపు 
సూర్యొదయం  ఎరుపు
సంధ్య రూపు ఎరుపు 


ఆరోగ్యం 


పరిసరాల నెప్పుడు 
పరిశుభ్రం గుంచుకో
రోగాలు దరికి ఎపుడు 
రాకుండ్ చూచుకో 


చెత్త చెదార మంత చేర్చి
ఎత్తి కుప్ప నందు కాల్చు 
తోటివారు కూడ ఎపుడు 
పాటించ వలె శుభ్రత 


తరగతంతా శుచిగయున్న
తరగకుండు ఆరోగ్యం 
ఎచట మురికి యుండునో 
నచట దోమలుం డును 


ఎచట ఎంగిలుం డునొ
నచట ఈగ మూగును
దోమలోద్దు ఈగలోద్దు
మురికి వద్దు ఎంగిలోద్దు


మనం చదివే బడులెపుడు
దేవుడుం డే గుడులు కాదె 
దానం గల్గి నొడికన్న
ఘనుడా రోగ్య వంతుడు 

**********          **********

మూడు కోతులు 


మంచి పలికే తందుకే
మనకు నోరున్నది 
చెడును చెప్పి నోటిని 
పాడు చేయ కెపుడు 

శుభం వినెతందుకు 
చెవుల మన కున్నవి
అశుభం విని చెవులలో 
కసువు కోరి పెంచకు 


ఉన్న మంచి చూడను 
కనులు మనకున్నవి 
ఎన్నడైనా చెడును చూడ 
కనుల నాసలె నుమ్చకు 


నోరు చెవి కనులతో 
పెరుమేరి తెచ్చుకో 
మూడు మర్కటాల కథ 
మురిసి చెప్పే గాంధీ తాత

*********          **********


ఏంది


గాంధీ మన జాతిపిత 
ఖాదీ మన జాతికి ప్రీతి 
బూందీ ఒక తిను బండారం 
బ్రాంది ఒక చేదు పనిఇయం 
ఏంది మన తెలుగునా యాస 
హిందీ మన దేశపు భాష 

**********          **********

చదువుల తల్లి 

అక్షర జ్యోతి వెలిగించు 
రక్షణ జాతికి కలిగిం చు 
విజ్ఞాన కళిక రగిలించి 
అజ్ఞాన చీకటి తొలగించు 
పలకా బలపం పట్టి నేర్చుకో 
పడుచు ముసలి భేద మెంచుకో 
చదువుల తల్లి మీ వెంట 
సేద తీరాలి మీ ఇంట

**********          **********

సామెతలు


నేరు కాగాక వర్షం రాదు 
గింజ నాక పంట పండదు 
గుమ్మడి నాటిన మామిడి కాయదు 
చదవ కున్నాను విద్య దక్కదు 
కష్ట పడకనే ఫలితం దక్కదు 


**********           ***********


దేవుడెక్కడ 


గుడిలో ములన మదిలో నున్న 
మంత్ర తంత్రము మాటి మాటికి 
జపము చేసేది జాతి మనిషిని 
దేవుడెక్కడ చుపమంటు 


దండ మేటి నడిగెను బాలుడు 
నొక్కి నొక్కి బాలడు నడగగా 
స్రుక్కి పోయేన పూజారి 


బడిలో బాలుర మేధ్యన చేరి 
బోధనా చేసే గురువుని చేరి 
పట్టు వదలక నిట్టె బాలుడు 
దేవుడెక్కడ  చూప మంటూ 
దండం పెట్టి బాలుదదగగా 


ఒక్క మెతుకు తినక పొయినా 
డొక్కా లంతుకు పోయి వున్నను
బుజ్జి పాపకు పాలను యిచ్చే 
అమ్మ చూపులో చూడుము దేవుని

**********           ***********


దేవుడిల్లు


మా ఇంటి సందు చివర 
ముసలి ఒకడు మరణించ 
వురువడ అంత చేరే 
ఇసుక వేస్తే రాల కుండ 


అంత మంది  గుమికూడా 
ఆశర్యం బాలకునికి 
అమ్మ చీర చేగు పట్టి 
అనుమానం తోడురాగా 


బాలుడడిగే అమ్మను 
అసలు మనకు కానరాడు 
చెప్పు అమ్మ నిజం చెప్పు 
ఎదకేల్లి పోయినాడు?


దేవుదిమ్తి కేల్లెనా? 
దయ్యమింటి కేల్లెనా?
అంత మంది చేరి రంటే?
అనుమానం నీకెందుకు 
ముసలివాడు తప్పక 
ముక్తినోమ్డే చెప్పక 

**********           **********


పొదుపు

పొదుపు గూర్చి అమ్మ ఎపుడు 
పోడుపు కథలు చెప్పు నెపుడు 
అదుపు తప్పి ఖర్చు  వలదు 
ముందు ఏంటో వ్రతుకు కలదు 


చినుకు చినుకు ఒక్కటై 
చేరు వంతా నిండి పోవు 
మాట మాట ఒక్కటై
మహా గ్రంధ మొకటి వెలయు 


అన్న మాట గుర్తు కొచ్చి 
అమ్మ మాట తీర్చ నెంచి 
చాకు లెట్లు చ్రు తిండ్లు 
ఏకంగా మాను కుంటి


అమ్మ యిచ్చిన డబ్బులు 
అసలు ఖర్చు చేయకుండా 
అమ్మ చెప్పినట్లుగా 
సొమ్ము చేయ నెంచితి 


పైసా పైసా ఒక్కటై 
పదులు వేలుగా మేరిపోయే 
కిద్ది బ్యాంకు లో దానం 
వడ్డీ తో పెరిగే నిజం 


ఒరుల సాయం లేకుండా 
వచ్చి చేరే సోమ్మేంతో 
చిన్న చిన్న చురు కోర్కెలు 
స్వయంగా నే తీరిపోయే 

**********           **********

చదువు 

బ్రతుకు నేర్పు నన్నది చదువు ఒక్కటే 
చదువు లేక పొతే నివు పశువు వొక్కటే 


సహనమేమ్తో అబ్బును చదువు గల్గిన 
సరస మెంతో తోడగు చదువు నీర్చిన 


కోప తాప మంట చదువు కూడ దనును గా 
కానీ గుణము లన్ని యిట్టే త్రోసి వేయిగా 


మనిషి యనగా నర్ధమే మనకు తెల్పును 
మానవతా విలువ లెన్నో గూడా బెట్టునే 


మనము బ్రతుకు తోక్కటే గొప్ప కాదను 
తోటివారి మేలు కోరే బుడ్డి నిల్పును 


సమ్పూర్న మూర్తిత్వం చదువు నేర్ప కున్నచో 
లోక వంచనమ్ము కాక చదువు లెందుకు 

**********          **********


సునామీ


అర్థరాత్రి మా యింట్లో 
ఆద మార్చే మొద్దు నిద్దట్లో 
నిద్ర వచ్చి ఆవులించే
గాఢ నిద్ర లోన ఇల్లు 


గుర్రు పెట్టి కలవరిల్ల 
మెలకువచ్చి బుజ్జిగాడు 
పలుకు వారొకరు లేక 
బావురుమని ఎడ్వసాగే

నిద్ర చెడి అందరమూ 
ఆగ్రహంగా కేకలేయ 
తలుపు నెవరో తట్టి నట్లు 
గోల్లెమేమ్తో గోలపెట్ట 


తలుపు తెరిచి చూడ బోగా
భళ్ళుమని నీరు చోరగ 
భయము తోడ కేక లేస్తూ
పరుగున మే మెరక ఎక్క 


బ్రతికి బయట పడితి మెంటే 
బుజ్జిగాడి పుణ్యమే 
సులువుగా మేమంతా 
సునామీని జయించితిమి

*********           **********

ఏకత్వం 


సురుడోక్కడే చంద్రు డొక్కడే 
అలుకు బెళుకుల తారలెన్నో 
అన్ని చేరగా నా అందమైన 
ఆకాశాన్ని అరసి చూడుమా 


భూమి ఒక్కటే నిరు ఒక్కటే 
చెట్లూ చేమలు జిఇవులెన్నో 
అన్ని కలసిన అవని చూడుమా 
ముచ్చ టౌనుగాముదము హెచ్చగా 


ఈ దేశమో క్కటే  ఈ  జాతి ఒక్కటే
మా కులాలెన్నో మా మాటలెన్నో 
మాభాశాలెన్నో వేశాలెన్నో 
భిన్నమినాను భారతీయులం 


అన్ని చదువుల సారమొక్కటే 
అన్ని మతముల బోధనోక్కటే 
దేవుడొక్కడే ప్రేమ ఒక్కటే 
నీవు వ్హేప్పుమా ఆ నిజం ఎప్పుడు


భిన్నము లెన్నో వున్న వారము 
ఎన్ని వున్నను మేమేక రూపము 
స్వర్గ మైనను సాటి తదుర 
భారత భూమికి దీటు లేదుర

**********           **********


అసూయ


తమ్ముడు పుట్టినంత 
తరిగిపోయే ప్రేమ సుంత
నన్ను ఎత్తుకోనుత మని 
చిన్న వాడ్ని ఎత్తుకుంటే 


పెద్దనైన నన్ను జూచి
సర్ది చెప్పు మాట మరచి 
పసివాడినని గురుతుపోయి 
నసపెట్టిగా విసిగి పోయి 


అలవాటుకాని పనులు 
అదలించి చెబుతుంటే
చిన్న వాడితో నన్ను పోల్చి 
చిర్రు బుర్రు లాడుతుంటే 

వానివలె కుదురు లేదు 
వాదులాటే నేకపుడు 
నీకంటే చిన్న వాడు 
వాడ్ని చూచి నేర్వమంటే


ఓర్వలేని తనం బలిసి 
ఈర్ష్య గుణం తోడూ కలిసి 
అసుయగానాలో నిండి 
వసివాడి  పోతుంది గుండె 


బాలలలో అసుయకు 
భాదులేవారు పెద్దలే 
అనుగున్యతతో బుజ్జగించి 
ఆదరంగా పలికి నమ 


ఆనందమే మా బాల్యం 
అసుయకే తావు శూన్యం 


**********           **********


భయం 


భయమంటూ లేదుగా 
మా కెపుడు నిజంగా 
అమ్మ మాకు చెప్పు దసలు
బుఉచోది కథలు ఎపుడు 


పిల్లి మేక కుక్కలను 
ప్రేమతోడ తాను పట్టి 
తాక మంటు మమ్ముల 
బుజ్జగించి చెప్పును 


నీరంటే మాకు భయం
లేకుండా పారద్రోల 
చెరువులలో జలక మాడ 
చేరదీసి నాన్న ఈతనేర్పు 


సాహస కథలలో మనం 
చరిత్ర్ కెక్కాలి మనం 
సాహస బాల బాలికలనే
స్వేచ్చ భారతి కోరుతుంది 

(సమాప్తం )
ti