Sunday, March 21, 2010

బాల "కథ"

 బాల "కథ"





                          ఓ కథ

 
                       - యస్.కె.కాశింబి                                                                                            4 వ  తరగతి, NSC ప్రాథమిక పాఠశాల,
                   త్రిపురాంతకం



                                
                       



                        

                  ఒక ఊరిలో రాము అనే అబ్బాయి వుండేవాడు. ఆ అబ్బాయి నాలుగవ తరగతి
చదువుతున్నాడు. రోజూ బడికి వెళ్ళేటపుడు బడి దగ్గర ఏదైనా కొనుక్కోవడానికని
వాళ్ళ అమ్మ ఒక రూపాయో, రెండు రూపాయలో ఇస్తూ వుండేది. అతను ప్రతి రోజూ
ఇంట్లో యిచ్చిన డబ్బులన్నిటికీ కొనుక్కోకుండా కొంత డబ్బుకు కొనుక్కొని ,
మరి కొంత డబ్బును  బడిలో సారు దగ్గర వాళ్ళ ఇంట్లో తెలియకుండా  " సంచయిక"
లో దాచుకునే వాడు. అలా దాదాపు రూ.210/- ల వరకూ పొదుపు చేసుకున్నాడు.                                                                                            ఒక
రోజు వాళ్ళ ఇంటికి వాళ్ళ మామయ్య వచ్చాడు. రామును దగ్గరకు తీసుకొని బాగా
చదువుతున్నావా అల్లుడూ! అని అడిగాడు. బాగా చదువుతున్నాను మామయ్యా !
అన్నాడు. రామును రకరకాల ప్రశ్నలు అడిగాడు. అన్నిటికీ చక్కగా సమాధానం
చెప్పినందుకు, మెచ్చుకుంటూ రాముకు నచ్చిన  సినిమా చూపించడమే గాకుండా,
ఇరవై రూపాయలు బహుమతిగా కూడా ఇచ్చి వెళ్ళాడు. ఒక్కసారి అంత డబ్బు
వచ్చేసరికి , రాము మరల రోజు బడికి రాగానే, తనకు బాగా ఇష్టమైన ఐస్
క్రీములు 15 రూపాయలకు కొనుక్కుని తిన్నాడు. దాంతో తెల్లవారేసరికి వాడికి
బాగా జలుబు చేసి, జ్వరం కూడా వచ్చింది. వాళ్ళ అమ్మ వాళ్ళు బాగా బీదవాళ్ళు
అవడంతో డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళడానికి డబ్బులు   లేక బాధ పడుతుంటే,
రాము నా దగ్గర వున్నాయని చెప్పాడు. వాళ్ళ నాన్న  నీకు డబ్బు ఎక్కడిది రా
అన్నాడు. రోజూ నాకు కొనుక్కోడానికి మీరు నాకు ఇచ్చే దానిలో కొంత సారు
దగ్గర పొదుపులో దాచుకుంటున్నానని చెప్పాడు. అపుడు వాళ్ళ నాన్న చాలా
సంతోషపడి సారుకు చెప్పి ఆ డబ్బులు తెచ్చాడు. డాక్టరుకు చూపించాడు. రాముకు
జ్వరం తగ్గింది. రాము తెలివితేటలను డాక్టరు కూడా మెచ్చుకున్నాడు.
అదేవిధంగా చల్లని పదార్ధాలను అంత అతిగా తినకూడదని చెప్పాడు. రాము
ఇంకెప్పుడూ అంత ఎక్కువగా ఐస్ క్రీం లు తినలేదు.




 నీతి: డబ్బు దాచుకోవడం వలన మనకే ఉపయోగపడతాయి


(ఈ కథ ను పంపిన వారు శ్రీ మద్దిరాల శ్రీనివాసులు, ఉపాధ్యాయుడు , త్రిపురాంతకం dt,31.03.2010 )






                                             ఎగిరే గుర్రం
                       (ఈ కథ ను 5 వ తరగతి లో రాసాడు )
                               -తాతా వెంకటేశ్వర రావు ,8 వ తరగతి  







        అనగనగా ఒక రాజు వున్నాడు. ఆ రాజు కు ఒక కొడుకు .అతనిపేరు వెంకి . రాజు తన కుమారునికి  ఒక  గుర్రాన్ని బహుమతి గా ఇచ్చాడు .
             అది ఒక వింత గుర్రం .ఆ గుర్రం ఎక్కి కాలితో తన్నితే ఆకాశం లోకి ఎగురు తుంది .
             రాజ కుమారుడి విద్య అభ్యసించటానికి గురుకులానికి వెళతాడు.
             ఈ గుర్రాన్ని తోటమాలి కొడుకు చాటుగా చూస్థూ ఉంటాడు.
             ఒక రోజు రాకుమారుడు గురుకులం కు వెళ్ళిన సమయంలో తోట మాలి కిదుకు గుర్రం మీద ఎక్కి ఆకాశం లోకి వెళ్ళాడు. అప్పుడు ఆకాశం నుండి కిందికి చూసినతోటమాలి కొడుకు గుర్రం ని ఒక్క తన్ను తన్నాడు. అప్పుడు అది క్రిందికి దిగింది . తోటమాలి కొడుకు రాజు ఇంటి ముందు గుర్రాన్ని వుంచి వెళ్లి తన తండ్రి దగ్గర కూర్చున్నాదు.ఒక రోజు రాజ కుమారుడు విద్య నభ్యసించి త్వరగా ఇంటికి వస్తుండగా,దారి మధ్యలో ఆకాశ మార్గమున తోరమాలి కిదుకు తన తండ్రి గారు బహుకరించిన గుర్రం పై విహారిస్తుండటం రాజకుమారుడు చూసాదు. రాజకుమారుడు ఆ గుర్రాన్ని వెంబడించాడు.
           తోటమాలి కొడుకు ఆ గురాన్ని రాజు ఇంటి ముందు పెట్టి తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఈ విషయం రాజు గారికి తెలిసింది. రాజు గారు తోరమాలి కిడుకును కొట్టి ఇంకా  ఎప్పడు తన కుమారుని వస్తువులు తీయ వద్దని పంపించి వేసాడు.
           తన కుమారుడు ఇలా చేసినందుకు టోర మాలి బాధ పడ్డాడు.
           ఆ రోజు నిద్రలో తోటమాలి కుమారుడు రాజు తిట్టినా తిట్లన్నీ మర్చి పోయాడు .ఆతరువాత రాజ కుమారుడు,తోటమాలి కొడుకు మంచి మిత్రులయ్యారు.

No comments:

Post a Comment