Friday, March 12, 2010

*బాల ' కవితా' కళ

        




వికృత నామ సంవత్సర ఉగాది బాలల కవి సమ్మేళనం లో పాల్గొన్న చిన్నారులు.
నిర్వహణ: తాతా రమేశ్ బాబు







                   మార్చ్ పదమూడో తేది సాయంత్రం గుడివాడ స్టేషన్ రోడ్ లో గల 'బొమ్మరిల్లు' ప్రాంగణం లో 'వికృతి' నామ సంవత్సర ఉగాది బాలల కవి సమ్మేళనం జరిగింది . పదిహేను మంది చిన్నారులు తమ కవితా గానం చేసారు. ఆ తరువాత 'బాల కళ' అంతర్జాల పత్రిక ను ఆవిష్కరించటం జరిగింది.
               ఇందుకు సంబందించిన వార్తలను పద్నాలుగో తేది న ఈనాడు దినపత్రిక జిల్లా అయిదవ పేజి ,ప్రజా శక్తీ దినపత్రిక జిల్లా నాలుగవ పేజిలో ,ఆంధ్ర జ్యోతి దినపత్రిక పదిహేనవ పేజి లో ,సూర్య దినపత్రిక జిల్లా తొమ్మిదవ పేజి లో, ఆంద్ర భూమి దినపత్రిక జిల్లా నాలుగవ పేజి లో ,వార్త దినపత్రిక పడవ పేజి లో నూ ప్రచురించారు. వీరికి 'బాల కళ" ధన్యవాదాలు తెలుపుతోంది.
             ఈ ఉగాది కవి సమ్మేళనం లో పదమూడు మంది చిన్నారులు పాల్గొని తమ కవితా గానం చేసారు.
              వారి కవితలను యదాతదంగా ఇక్కడ ప్రచురిస్తున్నానu .దర్శించండి.అభిప్రాయాలు క్రింది  పెట్టెలో చెప్పండి.










                     "అందరి ఉగాది "

                                -కుమారి జేబు శ్వేత ,ఎనిమిదవ తరగతి


మా పండుగ ఉగాది
ఉగాది మా పండుగ
అంటారు అందరు
మన పండుగ అనరెందుకు?


ఉగాది పండుగ -అందరి పండుగ


మరచిపోయిన రుచులను
గురుతు చేసే పండుగ
మరచిపోకూడదు మనం
పిల్లలమూ ,పెద్దలమూ


ఉగాది పండుగ -అందరి పండుగ


పెద్దల సమస్యలు తీరాలి
పిల్లల చదువుల గెలవాలి
అందరం సంతోషం గా
కలకాలం హాయిగా వుండాలి


ఉగాది పండుగ-అందరి పండుగ


ప్రొద్దున్నే నిద్ర లేచి
ఎంచక్కా తలమ్తుకొని
ధగ ధగ లాడే దుస్తులు
ధరించి జరిపే పండుగ


ఉగాది పండుగ -అందరి పండుగ




****** ****** ******




                     "సృష్టి కి చెట్టు అందం "


                                        -కుమారి వేలగాడ పార్వతి ,ఎనీదవ తరగతి


వేప చెట్టుకు వేపపువ్వు అందం
వేపపువ్వు ను చేదుగా తిందాం
ఆకుల తోరణాలు గుమ్మానికి అందం
మామిడి కాయను పుల్లగా తిందాం


పూవులు కోసి దేవుడికి పెడదాం
తీపి కోరికలు దేవుడుకి చెప్పుకుందాం
చిన్ని పక్షుల గూళ్ళు
చెట్టుకు నిలయం


వాన వస్తే పచ్చని చెట్టు
తడవనివ్వని గొడుగు


చెట్టు మనకి ఇస్తుంది
చెట్టు మనకి ఇల్లు ఇస్తుంది
చెట్టు మనకి దారి చూపుతుంది


ఇన్ని మంచి పనులు చేసే చెట్టును
నరికి వేస్తారు ఎందుకని?


పచ్చని చెట్లు పచ్చని పైరు
సృష్టి కి మూలమ్ చెట్లు అందం




***** ****** *******




          "ఎందుకోసం?"


                       -వి.నీలిమ ,తొమ్మిదవ తరగతి




పువ్వు వేచింది దేవుడు కోసం
నెమలి వేచింది నాట్యం కోసం
పావురం వేచింది శాంతి కోసం
నేను వేచింది దేశప్రగతి కోసం
నేడు అందరూ
వేచింది ' వికృతి ' కోసం


****   *****    ******                                                                        


       " పిల్లల గమ్యం?" 




                             -శీలం వాసవి,ఎనిమిదవ తరగతి




కొంతమంది పిల్లలు
రోడ్ల పైనా ,హొటల్లలొనూ
పని చేస్తారు ఎందుకని ?
మరి కొంతమంది పిల్లలు
కారుల్లోను ,బంగాలాల లొనూ
వున్నారు ఎందుకని?
అసలు పిల్లలంటే
ఆదుతూ,పాదుతూ,చదువుతూ
వుండాలని అంటారు పెద్దలు
ఈ తేడా లెండుకని?

***  ****  ****


 


              "తస్మాత్ జాగ్రత్త"


                              -చవల లతాశ్రి,ఎనిమిదవ తరగతి


రోజు గడిస్తే
రాలిపోయేది పుష్పం
గాలి వీస్తే
ఆరిపోయేది దీపం
మెలకువ వస్తే
చెదిరిపోయేది స్వప్నం
తప్పు చేస్తే
పోయేది జీవితం


ఎన్నటికి
ఆదకూదదు అబద్దాలు
ఎప్పటికీ
చెయకూదదు  తప్పులు
ఎలాగో
బ్రతకాలి నిజాయతేగా
ఎదగాలి
జీవితంలో గొప్పగా


మరచిపొకూదదు
చదువు గొప్పతనం
మరివకూదదు
తల్లి దైవమని
తిరిగి రాదు
రోజు ఎన్నటికి
గుర్తించు
మంచి ఎప్పటికి


*****      *****    *******  


 


         "ఆకాశ పరిమళం "


                             - స్రవంతి ,తొమ్మిదవ తరగతి 


ఆకాశం లో చినుకును మరువను
చినుకు ఇచ్చే పరిమళాన్ని మరువను
మనస్సు లోని మమతను మరువను
మన ప్రగతికి బాటలు వేసే మాస్టార్ని మరువను


**********        ***********     *********




       'ఉగాది పచ్చడి"


                 -చుక్కా నాగ దుర్గా ప్రసాద్,ఎనిమిదో తరగతి


వికృత ఉగాది వచ్చింది
ఆరు రుచులను తెచ్చింది
మామిడి పండు లోని పులుపు
అది తిన్న వారికే తెలుసు


ఆరు రుచులు ఆరు ఋతువులు
ఒక్క లాగే వుంటాయి
అన్ని రకాల బాధలు
ఆరు తో పోవాలి


ఉగాది పచ్చడి లోని రుచి మధురం
చెరుకు గడ తీపి అమృతం
వేప పువ్వు చేదు తిందాం
ఈ పచ్చడే ఒక అద్భుతం !

**********       *********      **********




                ''అసలైన అందం"


                            -పెరుపోగు మాధవి,ఎనిమిదో తరగతి.




వేప చెట్టు కి వేపపూవు అందం
మామిడి చెట్టు కి మామిడి కాయ అందం
అరటి చెట్టు కి అరటి కాయ అందం
పిల్లలందరికీ  చదువు కుంటేనే అందం


*********       **********       *********


                     "అమ్మ "


                                -నాగిరెడ్డి హేమలత,ఎనిమిదవ తరగతి.


అమ్మ పిలుపు
కోకిలమ్మ పిలుపు
అమ్మ చీర
ముద్దా బంతి పూవు
అమ్మ గుప్పెడంత
బిడ్డలు గంపెడంత
మీ అమ్మ పేరు ఏమిటి?
అనడుగు తారు ఎవరైనా
అన్నిటి కన్నా
అమ్మ పేరే మిన్న

********       ***********      ********

                     "అమ్మ-చదువు"


                             -నగిరేడ్డి హేమలత ,ఎనిమిదో తరగతి.


అమ్మ అంటే నా కిష్టం
నేనంటే అమ్మ కి ఇష్టం
అమ్మ ప్రేమ మధురం
అమ్మ మాట మిటాయి


అమా దేముడు లాంటిది 
అమ్మ వెలుగు లాంటిది
అమ్మ చదువు లాంటిది

*********         *********       *********


                   ఉగాది 


                  -భోగాది ఝాన్సి
                   జి.ప.ఉన్నత పాటశాల, భావదేవర పల్లి.






ఉగాది,ఉగాది,ఉగాది,
యుగ యుగంబుల ఆది 
తెలుగు సంస్క్రుతికి పునాది 
రుచులను ఇచ్చే ఉగాది 


ఉప్పు,పులుపు,కారం
చేదు ,తీపి,వగరు 
ఆరు రుచుల ఉగాది 
సుఖ దుఖ్ఖాల ఉగాది 

(ఈ కవితను చిన్నారి చే రాయించి పంపినవారు శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ ,24 -03 -2010 )

 

**********          ***********     **********


మాఅమ్మ



అల్లరి చేస్తే అరుస్తుంది.
ఆకలేస్తే అన్నం పెడుతుంది
కోపం వస్తే కొడుతుంది.
తప్పులు చేస్తే తంతుంది.
నిద్దరొస్తే జోకొడుతుంది.
ఏడుపొస్తే ఎత్తుకొంటుంది
అప్పుడు ఐస్ క్రీం కొనిస్తుంది.

 
                     రచన: తరుణ్, NSC పాఠశాల, త్రిపురాంతకం



(ఈ కవితను రాయించి పంపించిన వారు శ్రీ మద్దిరాల శ్రీనివాసులు,   ది. 29 .03 .2010 )
**********             ***********





         బాలలం 
                   -భోగాది లహరి,

                            జి.ప.ఉన్నత పాటశాల, భావదేవర పల్లి.




బాలలం  బాలలం 
భావి జగతి పాలకులం 
బాలలం  బాలలం 
బాగుగ చదివే బాలలం 

          ఆటలు బాగా అడేదము
          పాటలు బాగా పాడెదము 
          బిమ్మలు బాగా గీసేదము 
          అల్లరి బాగా చేసెదము 

************            ************

మిగిలిన కవితలు తరవాత పోస్ట్ చేస్తాను

3 comments:

  1. It is well beginning Sir. All the best to you and ur students.

    ReplyDelete
  2. pillalu!mee kavitalu chalaa baagunnayi raa!tata mamayyaku nijamgaa mappidalu cheppali konni kavitalu antya prasalato baginnayi meeru rojuu 1 kavita rayandi meeandariki mappidalu mee gudiseva vishnu prasad

    ReplyDelete
  3. అమర్ గారు,గుడిశేవ గారు పిల్లల కవితల మీద మీరు చెప్పిన అభిప్రాయాలకు వారెంతో సంతోషపడుతున్నారు. మీరు కూడా, తెలిసిన చిన్నారులు రాసిన కవితలు పంపి బాలకళ కు వన్నెలు అద్దాలని కోరు కుంటున్నాము
    -మప్పిదాలు

    ReplyDelete