(పచ్చిమ గోదావరి జిల్లా ,పెదపాడు మండలం,కోర్లమ్మకుంట ,ఎం.పి.పి .స్కూలు వార్షికోత్సవం లో చెప్పిన స్వీయ కవిత-తేది: 18.03.2010)
"మేమంతా..."
-శ్రీ 'కాట్రగడ్డ'
పిల్లలం !పిల్లలం !పిల్లలం !
అక్షరాలూ నేర్చుకొనే ఎల్లలం !ఎవరి పిల్లలం!
అందమైన పిల్లలం !మంచి మనసు మల్లెలం!
పిల్లలం! పిల్లలం!మేమంతా బడి పిల్లలం!
కనుల చూసి-చెవుల వినగా
తెలుగు భాష శిక్షితులం ;
మొక్కలపై మక్కువతో
విత్తనాలు వెదజల్లే రక్షకులం!
అమ్మ,నాన్న ,ప్రేమాలోదుగు
మాటలుగా-పాటలుగా,
అక్షరాలూ నేర్చి కూర్చి
పోటిపడి ఆటలాడు పిల్లలం!!
లక్షణ గురువులకై శిష్యులం!
బాలురకు,బాలికలకు స్నేహితులం!
మాబడిలో మార్మోగే నవ్వులం;
గుడిలాంటి మా బడి లో దివ్వెలం!!
మేమంతా తెలుగు తల్లి పిల్లలం
తెలుగు దేశ నలుదిక్కుల
మారడుగు లేయ ఎదుగుచున్న
చదువులమ్మ పోషణలో పిల్లలం!
పిల్లలం! పిల్లలం! పిల్లలం!
ఆంధ్రాక్ష రాల హారతులిడు పిల్లలం!
అందమైన గ్రామాన భారతీయ ముల్లెలం!
పిల్లలం! పిల్లలం!మేమంతా బడి పిల్లలం!
******** ******** ********
బాలల్లారా...
శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ ,ది. 24.03.2010
బాలల్లారా మీరు బాగుగా చదువుచు
మంచి నడవడి కను మాసాలు కొనిన
జగతి మెచ్చు మీకు జయము కలుగుచుండు
'బాల కళ 'కు కవిత పంప రండి
********** *************
-తాతా రమేశ్ బాబు
రంగులు రంగులు రంగులు
రా చిలకా వేసెద రంగులు
ముక్కుకు ఎరుపు రెక్కకు పచ్చా
చక్కగా నేను పూసెద రంగులు!!
రంగులు రంగులు రంగులు
రంగులు !రంగులు!!
-తాతా రమేశ్ బాబు
రంగులు రంగులు రంగులు
రా చిలకా వేసెద రంగులు
ముక్కుకు ఎరుపు రెక్కకు పచ్చా
చక్కగా నేను పూసెద రంగులు!!
రంగులు రంగులు రంగులు
ఓ కాకి పూసెద రంగులు
అంతా నలుపూ కళ్ళే తెలుపూ
చిక్కగా రంగులు పులిమెద నీకు !!
రంగులు రంగులు రంగులు ఇడుగిడిగో బుదుగూ గాడు
చొక్కా లేదుగా లాగూ నలుపు
తప్పవు నీకు రంగులు నేడు!!
రంగులు రంగులు రంగులు
పుస్తకాలలో బొమ్మలు గీసి
గీసిన బొమ్మకు రంగులు వేసి
చిత్రకారుడను ఆవుదును తప్పక !!
అక్షర మాల
-గంటా సాధు సుభాకర రావు , సెల్:9248175140
హెచ్ .ఎం .,ఎం.పి.పి.స్కూల్ ,
సేరిదగ్గుమిల్లి .గుడ్లవల్లేరు మండలం
అమ్మ పెట్టిన తాయిలంతో
ఆనందంగా బడి కెళ్ళాను
ఇక్కడ అక్కడ
ఈలలు వేస్తూ
ఉరకలు వేస్తూ
ఊయల ఉడతల కథలే వింటూ
ఋణమో పణమో ఏమీ తెలియక
ఋ అని దీర్ఘం తీస్తూ
ఎరుపు,నలుపు,పసుపు ,తెలుపు
ఏడు రంగుల ఆటలు ఆడి
ఐదు ఆరు ఒకట్లు చెప్పి
ఒప్పుల కుప్ప ఆటలు ఆడి
ఓడల ఒంటెల కథలే వింటూ
ఔరా అని ఆశ్చర్యం తో
ఆం తా ఎంతో సంతోషించి
ఆః అంటూ మురిసిపోయాము
కలము కావాలని మారాం చేస్తే
ఖర్జురపు పండు నాన్నే ఇస్తే
గబగబా తిని నే
ఘణ ఘణ ఘణ ఘణ గంటలు మోగగా
జ్ఞ అంటూ దీర్ఘం తీస్తూ
చక చక బడికి
ఛలో అంటూ
జతగా కూడి
ఝమ్మని పోయి
ఇణి మాస్టారు రాస్తే
టక్కున నేను
త పామని శబ్దం చేశా
డప్పుల మోతల్లె
డమాల్ డమాల్ అని గ
ణ గణ గంట మొగంగా
తలుపు తోసుకుని
తపా తపాయని
దబ్బున నేను
ధన ధన చప్పుడు
నడకల
పరుగుల పసందులతో
ఫస్టున నేను
బయటకు వెళ్లి
భలే భలే
మన మంచి బడి
యని
రయ్యిన నేను
లయ గా జతగా
వడివడి గా బయటకు వెళ్లి మా బడికి
శలవు వద్దు గిలవూ వద్దని సంతో
షముగా గంతులు వేసి
సరదాగా ఆటలు ఆడి
హమ్మని హుమ్మని గ
ళ మెత్తి అ
క్షర దీపం నాలోవెలగగా
ఱయ్యిన నేను ఇంటికి పోయా !
(ది. 04 .04 .2010 )
********** ***********
తల్లి జిజియా భాయి తనయ శివాజీ కి -గంటా సాధు సుభాకర రావు , సెల్:9248175140
హెచ్ .ఎం .,ఎం.పి.పి.స్కూల్ ,
సేరిదగ్గుమిల్లి .గుడ్లవల్లేరు మండలం
అమ్మ పెట్టిన తాయిలంతో
ఆనందంగా బడి కెళ్ళాను
ఇక్కడ అక్కడ
ఈలలు వేస్తూ
ఉరకలు వేస్తూ
ఊయల ఉడతల కథలే వింటూ
ఋణమో పణమో ఏమీ తెలియక
ఋ అని దీర్ఘం తీస్తూ
ఎరుపు,నలుపు,పసుపు ,తెలుపు
ఏడు రంగుల ఆటలు ఆడి
ఐదు ఆరు ఒకట్లు చెప్పి
ఒప్పుల కుప్ప ఆటలు ఆడి
ఓడల ఒంటెల కథలే వింటూ
ఔరా అని ఆశ్చర్యం తో
ఆం తా ఎంతో సంతోషించి
ఆః అంటూ మురిసిపోయాము
కలము కావాలని మారాం చేస్తే
ఖర్జురపు పండు నాన్నే ఇస్తే
గబగబా తిని నే
ఘణ ఘణ ఘణ ఘణ గంటలు మోగగా
జ్ఞ అంటూ దీర్ఘం తీస్తూ
చక చక బడికి
ఛలో అంటూ
జతగా కూడి
ఝమ్మని పోయి
ఇణి మాస్టారు రాస్తే
టక్కున నేను
త పామని శబ్దం చేశా
డప్పుల మోతల్లె
డమాల్ డమాల్ అని గ
ణ గణ గంట మొగంగా
తలుపు తోసుకుని
తపా తపాయని
దబ్బున నేను
ధన ధన చప్పుడు
నడకల
పరుగుల పసందులతో
ఫస్టున నేను
బయటకు వెళ్లి
భలే భలే
మన మంచి బడి
యని
రయ్యిన నేను
లయ గా జతగా
వడివడి గా బయటకు వెళ్లి మా బడికి
శలవు వద్దు గిలవూ వద్దని సంతో
షముగా గంతులు వేసి
సరదాగా ఆటలు ఆడి
హమ్మని హుమ్మని గ
ళ మెత్తి అ
క్షర దీపం నాలోవెలగగా
ఱయ్యిన నేను ఇంటికి పోయా !
(ది. 04 .04 .2010 )
********** ***********
శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ రచన
ది .05 .04 .2010 మంచి మంచి కథలు చెప్పి
దేశభక్తి నేర్పి దేశాన్ని రక్షించే
అట్టి తల్లి నీకు అవసరమ్ము
********** ***********
రమేష్ గారు ముందు గా మీకు నా నమస్కారా లు.పిల్లల గురుంచి ఒక బ్లా గు చేయాలి అనే మీ ఆలోచన ప్రశంశనీయం.మీరు రాసిన అక్షరమాల నాకు బాగా నచ్చింది.పిల్లల కు సులువు గా అర్ధం చేసుకొనే లా వుంది.
ReplyDeleteదేవి గారూ,
ReplyDeleteమేలుపొద్దులు. మీ లాంటి వారి సమష్టి కృషి తో బాలకళ ను అభివృద్ది చేయాలను కుంటున్నాను .మీరు కుడా మీకు తెలిసిన చిన్నారుల సృజనలను నాకు మెయిల్ చేయండి . 'అక్షరమాల ' రాసింది నేను కాదు . రాసిన వారి పేరు అక్కడే వుంది .మరల చూడగలరు. వారు మంచి కవి,ఉపాద్యాయుడు కుడా.....
మప్పిదాలతో ......