Thursday, April 1, 2010

మీ గురించి- శ్రీ పి.చంద్ర శేఖర ఆజాద్

మీ గురించి ,మీ చుట్టూ వున్నప్రపంచం గురించి మీ పిల్లలేమను కొంటున్నారో..........

మీ బిడ్డలు మీ కందిస్తున్న కానుక .........
మీ బిడ్డలకు మీ రందివ్వాల్స్సిన బహుమతి ..........
వీక్షించండి ....... మీ పిల్లలతో రాయించండి ........చిన్నారుల హృదయాలను తెలుసుకోండి.
నిర్వహణ : పి.చంద్ర శేఖర ఆజాద్

ఉదయం

నాకింకా బాగా నిద్రపోవాలని వుంది . అమ్మ మాత్రం 'లే లే ' అంటూ' గొడవ చేస్తుంది. నాకు మొహం కూడా కనపడకుండా దుప్పటి కప్పుకోవాలని ఇంకొంచెం సేపు నిద్ర పోవాలని వుంది. కాని అమ్మ ఊరుకోదు. నా మొఖం మీద నుండి దుప్పటి లాగేస్తుంది. అప్పుడు నేను కడుపు లోకి కాళ్ళు ముడుచుకొని పడుకుంటాను.
'రొజూ నీతో పెద్ద తలనొప్పిగా వుంది. ఉదయాన్నే లేవటం ఎప్పుడు అలవాట వుతుందో ' అంటూ' గొణుగుతుంది . అంతలోనే _ '
లే బాబు,దారికడ్డంగా మంచం వుంది. ఎవరైనా చూస్తె ఏమనుకుంటారు' అంది.
ఆ మాటలన్న్ని నాకు వినిపిస్తూనే వున్నాయి. అయినా లేవాలని పించదు. 'నిన్ను ఇట్లాకాదు ' అంది అమ్మ . వెంటనే శరీరం జలదరించింది. నీళ్ళ చుక్కలు శరీరం మీద పడ్డాయి. 'ఏంటమ్మా ' అంటు కోపంగా లేచాను
అమ్మకు ఇంకా కోపం ఆగలేదు.
'మీనాన్న గారిని లేపమంటావా' అంది
నాన్న గారు లేస్తే ఎం చేస్తారో నాకు బాగా తెలుసు .గొణుక్కుంటూ లేచాను. ఒక్కసారి ఒళ్ళు విరచుకొని నాన్న గారికేసి చూసాను . అయన ఇంకా నిద్ర పోతూనే వున్నారు. ఎనిమిది గంటలకు గాని అయన నిద్ర లేవరు. నాకు కుడా నాన్న్నగారిలా నిద్ర పోవాలని వుంటుంది.
రాత్రి పూట అమ్మ నాన్న గారితో అంటుంది.'వీడు రోజు ఉదయం లేవటానికి ఎంత గొడవ చేస్తున్నాడో. రాను రాను బద్ధకం ఎక్కువవుతుంది'.
'ఎరా' అంటారు నాన్నగారు.
నేనేం మాట్లాడను.
'రేపటి నుండి పెందలాడే లే ' అంటారు.
'అన్ని మీ బుద్దులే వస్తున్నాయి' అంటుంది అమ్మ .
నాన్న అప్పుడు ఏదో అంటారు.
'ఏమిటి,లేస్తే అలా కూర్చోవట మేనా? వెళ్లి ముఖం కడుక్కో' లోపలినుండి అరుస్తుంది అమ్మ .
మెల్లగా లేచాను. చిన్ని అప్పటికే లేచాడు. వాడు ఎప్పుడు ముందే లేస్తాడు. నాకంటే ముందే మొఖం కడుగు తాడు. పళ్ళపొడి కోసం చూసాను . అదెక్కడా కనిపించదు. అవునుకదా,అది నిన్ననే అయిపొయింది.ఇప్పుడు నేను ఉప్పుతో కడుక్కోవాలి. కడక్కపొతే తిడతారు. మా ఇంటి ప్రక్క వారయితే చక్కగా పెస్ట్లు లు వాడారు. ఎప్పుడో ఓసారి మాత్ర్రమే తెస్తారు. అది అయిపోతే మల్లి ఉప్పే.
ఈ ఉప్పు తో పళ్ళు తోముకోవటం నాకిష్టం వుండదు. అయినా ఎం చేయను? తప్పదు దాంతోనే ముఖం కడిగాను. అమ్మ ఇంకా అరుస్తూనే వుంది. టవల్ తో ముఖం తుడుచుకున్నాను.
గ్లాసులో పాలు పోసింది అమ్మ. స్పూన్ కూడా గ్లాసులో వుంది. నాకు స్పూన్తో తాగటం ఇష్టం .
'అలా తాగితే ఎం తాగినట్లు వుంటుంది .ఎంతసేపు టైం గడపటానికి చూస్తావ్' తిరిగి కసిరింది అమ్మ.
'హోం వర్క్ చేశావా' అంది అమ్మ .
అప్పుడు గుర్తొచ్చింది .గబగబా పాలు తాగాను. లెక్కలు చేయాలి. లేకుంటే టీచరు గారు కొడతారు . వెంటనే వెళ్లి పుస్తకాల ముందు కూర్చున్నాను.

(చిన్నారులూ,మీ నేస్తం రాసిన 'ఉదయం' .మీరుకూడా 'ఆకాశం', నాన్న, స్నేహం, సినిమా .అమ్మ .....ఇలా ఎవరి గురించి రాయాలనిపించినా ఝామ్మని రాసేసి నాకు పంపండి .ఇందులో ప్రచురిస్తాను.మరచిపోకండెం.)

2 comments:

  1. Hi.. i like your works.I liked your acting in laya serial,the way you teased the telugu master.I feel the laya serial is so near to our hearts.Please i need the Email Ids of all the members of the Laya team.I want to personally appreciate each one of your works.Keep it up.

    ReplyDelete
  2. హపీ గారూ, సంతోషం .
    నా వొర్క్స్నచ్చి నందుకు ఆనందం. లయ సీరియల్ లో నా నటన ,పంతులు గారిని ఏడిపించే విధానం ఎంజాయ్ చేసానన్నారు . ఈ సీరియల్ కు స్క్రీన్ ప్లే ,మాటలు రాసిన వారు శ్రీ పి.చంద్ర శేఖర అజాద్ .వీరు లయ లో మాధవయ్య గా నటించారు. వారి మెయిల్ ఇందులో వుంది. ఇంతకీ మీరు ఎమి చేస్తారు? మీ అసలు పేరు ? చెప్పనే లేదు..........

    ReplyDelete