Tuesday, April 13, 2010

శ్రీ పులవర్తి కోర్నేలియస్ " బాల గేయాలు"

మా వూరు

మాది పల్లెటూరు 
మంచి కదే పేరు 
చల్లని పిల్ల గాలులు 
చెంగు నెగిరే మేకలు 

నల్లనల్లని మబ్బులు 
తెల్ల కొంగల బారులు 
ఆ చెట్లూ ఆ చేమలు 
ఆ పశువులా పచ్చికలు 

ఆ చెరువులా తామరులు 
ఆ ఫలాలు ఆ వనాలూ
ఆ డొంకలు ఆ దారులు 
ఆ పొలాలు ఆ హలాలు 


ఆ జలాలు ఆ జనాలు 
ఆ కేకలు ఆ పిలుపులు 
అవే అవే ఇష్టం 
అవే ఎంతో ఇష్టం 


*********          **********


పల్లె పార్కు 


పల్లెటూరి పొలంలో 
పిల్లలుండే పార్కులో 
మల్లెలెన్నో పిలిచెను 
చెల్లెలా రారమ్ము 


మందారాల తేనెలు 
సన్నజాజుల వాసనలు 
ముద్దా బంతి వూసులు
జాజి పుల విరుపులు 


రామచిలుక చిట్టి పలుకు 
కోయిలమ్మ కూత మెరుపు 
పావురాల కువకువలు 
పాలపిట్ట పదనిసలు 


కాకి చెప్పు తీపి కథలు 
నక్క చెప్పు డాబు కబుర్లు 
పిచ్చుకమ్మ కిచకిచ లు 
గోరువంక రాచనడక


ఎగిరి దూకు ఆటలు 
వింత వింత పాటలు 
జారు బండ ఆటలు 
జోరుగుండు పార్కులో 


బెత్తమసలె పట్టని 
పంతులమ్మ పలుకులో 
చదువు తల్లి రూపము 
ఆమె మాకు దైవము 
అంతా మే మేకము


*********          ***********


బొమ్మలు 


ఎన్నెన్నో బొమ్మలు 
వింత వింత బొమ్మలు 
మా మంచి బొమ్మలు 
మా ఎదుట తిరిగే బొమ్మలు 
ఆట నేర్పే బొమ్మలు 
పాట పడే బొమ్మలు 
కమ్మనైన కథలు చెప్పే 
అవ్వ లాంటి బొమ్మలు 
కబురులాడే బొమ్మలు 
ఖరీదైన బొమ్మలు 
మాసిపోని బొమ్మలు 
వూసులాదె బొమ్మలు 
నడక నేర్పే బొమ్మలు 
వాడిగా పోవు బొమ్మలు 
అలక పడే బొమ్మలు 
ఎన్నెన్నో బొమ్మలు 
మా కిష్టమైన బొమ్మలు


**********          ***********


నేస్తాలు 


ఇల్లు కాయు కుక్కలు 
ఎలుక పట్టు పిల్లులు 
గొర్రె ఉన్ని నిచ్చును 
పలు నిచ్చు గోవులు 
పండ్ల నిచ్చు తరువులు 
మనము పెంచు జిఇవులు
మనకు మంచి దోస్తులు


*********          **********


కుర్రడు


మర్రి నీడ నున్నది 
కర్రియావు చిన్నది 
అర్రు చాచి యున్నది
గుర్రు పెట్టుచిన్నది
కుర్ర ఒకడు మెత్తగా
కర్ర పట్టి తొలగ
గుర్రుగా చూచుచు
చిర్రు బుర్రు లాడుచు
బుర్ర గిర్రు తిప్పగా
తుర్రుమనేను కుర్రడు 

*********           **********

బాబి

బాబి : అమ్మ అమ్మ చూడవే 
           అక్కేమి చేస్తుందో 
           నోట బెట్టి చేతి గోళ్ళు 
           నానబెట్టి కొరుకు చుండే 


తల్లి : తప్పమ్మా చిట్టి తల్లి 
          ఎప్పుదట్లు చేయకు 
         గోటనున్న మట్టి చేరి 
        చేటు తెచ్చి రోగమోచ్చు

అక్క : నాన్న నాన్న చిట్టి చెల్లి 
          సున్న లాగా నోరు తెరచి 
          బాటను వ్రేలు నోటబెట్టి
         నీటుగాను చీకు చుండే 


తండ్రి : అమ్మా నా చిన్న బుజ్జి 
           నోట వ్రేలు పెట్టి చీక 
           కూడ దమ్మ  ఎప్పుడు 
            చాకిలీట్లు నీ కిస్తా  చేగోదిలు తినిపిస్తా 

అక్క,చెల్లి  : ఆమ్మా మేం చెప్పమా 
                   అసలు బాబిగాడి చేష్టలు 
                   బలపాలు చేతబట్టి 
                   బొక్కినాడు నోట యిట్టె 


ఆమ్మా,నాన్న : బాబి బాబి అది నిజామా 
                        బల్ల పెరుగు పొట్టలోన 
                         వూబ పొట్ట వచ్చునయ్య 
                         లాభ ముండ దా పైన 

**********           **********


దినచర్య 


ప్రొద్దున్నే లేస్తా
పళ్లన్నీ తోముతా 
నీళ్ళ జలక మాడుతా 
తలచాక్కగా దువ్వుతా 
పాలన్నీ త్రాగుతా 
పలక చేత బట్టుత
పరుగున బడి కేల్లుతా 
ఆమ్మా ముద్దు తీరుస్తా
నాన్న మాట నిలుపుతా
పదుగురు మెప్పు పొందుతా 

**********          **********


త్రివర్ణ పతాకం 


జై...జై... త్రివర్ణ పతాకకు జై..
కత్తులు దూసుకు పొయినా
నెత్తురు తేరులు పారినా 
ఎత్తిన జండా దింప కోయి  త్రివర్ణ పతాకకు జై..


మూడు వన్నెల మా జండా 
ముచ్చటైన జాతి జండా 
వందకోట్ల భారత జాతి 
గుండెలలో వెలుగు జ్యోతి 


స్వాతంత్రం మా ఊపిరి 
సమభావం మా ప్రాణం 
సిరులకడే సంకేతం 
సమైఖ్యతే దాని రూపు 


సాన్తినే కోరుదాం 
సౌభాగ్యం స్థాపిద్దాం 
సవాలేవారు విసిరినా 
సాహసంతో ఎదిరిద్దాం 


**********          **********


మేమిద్దరం 


అమ్మ,నాన్న యిద్దరుగా 
అక్క నేను ఇరువురము 
పద్దు పెద్దగ పెంచాముగా 
ఒద్దికగా మేముండుముగా
పెద్ద చదువులు చదివేదము 
ముద్దు చేయగా మా వాళ్ళు 


**********           **********

నాన్నలా 


నాన్న లాగే నేను 
నల్ల కోటు వేస్తా 
కాలా జోడు తొడుగుతా
కళ జోడు పెడుతా 
కచేరికి వెళ్ళుతా 
కాగితాలు చూస్తా
మెంచి పనులు చేస్తా 
మా వాళ్ళ పేరు నిలుపుతా

**********          **********


అవ్వ 


అవ్వ మాట మాకు 
తువ్వాయి కేరింతలే 
మువ్వల గల గల మోతలే
గువ్వల కువకువ కుతలే 
తవ్వనున్న రేగిపండ్లు 
యివ్వ నంటూ విసిగిం పులు 
బువ్వమాట మరిచామని 
కవ్వపు చల్ల కలియ బోసి 
రవ్వ లడ్డు చేతి కిచ్చి 
రివ్వున తిన మంటది 

**********          **********

మా ప్రతిభ 

చెట్లలో చేమల్లో రాళ్ళల్లో రాప్పల్లో 
ప్రాణమున్న దంటు ప్రమాణంగా చూపిన 
ప్రాజ్ఞు దెవ్వరు ?జగదీశ్ చంద్ర బోస్ 
మా భారతీయుడు 

గణిత మందు గణుతికెక్కిన 
పూర్ణ స్వారపు రూపు దిద్దిన 
పుణ్య పురుషు దేవ్వరాతాడు ?
భాస్కరుడు మా భారతీయుడు 

గీతాలతో అమ్జలిమ్చి 
గీతంజలినే భువికి నిచ్చి 
నోబెల్ బహుమతినే 
తనదనిపిమ్చిన రవీన్ద్ర 
కవిండ్రు  దేవ్వదాతాడు 
మా భారతీయుడు 

సత్య హింస లాయుధంగా 
సమరామ్గానం సల్పెనాతాడు 
వసుధ పైన ప్రేమ పంచిన 
పసి హృదయు డెవ్వడు ?
బోసి నోటి గాంధీజీ 
మా భారతీయుడు 

పిల్లలన్న గులాబిలన్నాను 
వల్లమాలిన మక్కువతో 
విశ్వశాంతి కి సమిధయై 
శ్వాస విడిచేనే సంత మూర్తి ?
చా చా జవహర్ లాలు
మా భారతీయుడు 

తెలుగు భాషను జనుల భాషగ 
తీర్చి దిద్దిన దీరు దాటాడు
వెలుగు జాడలో తెలుగు తల్లిని 
చెలువ మీరా నడిపించే నాతడే 
గురజాడ మా తెలుగు వాడిగా 

**********          ***********

ప్రశ్నలు

పైకిసిరిన జామపండు 
పడుతుందేం క్రిందికి? 
పైనున్న పక్షి రాజు 
పడిపో డేం క్రిందికి? 

నీటనున్న చేప పిల్ల 
గడుసు మీరా నాడును 
ఒద్దు పడినంతనే
చతికిల బడు నెందుకు?

పూలపైన తుమ్మెద 
గ్రోలుచుండు తేనెలు 
సంపంగె పూలపై
సరసానికి వాల దేల ?


రైలెక్కి వూరబొవ
రకరకాల చెట్లూ చూడ 
రైలు కంటే వేగంగా 
దౌడు తీయు నెక్కడికి?


ఎన్నెన్నో ప్రశ్నలు 
విడదీయని చిక్కు ముళ్ళు 
అన్నిటికీ జవాబులు 
ఆదరంతో చేప్పరేల?


**********          **********


తెలుపు 


మల్లెపూవు తెల్లన 
వెన్నపూస తెల్లన
వెన్నలంత తెల్లన
అమ్మ మనసు చల్లన 


నలుపు 


ఆదిమనసు నల్లన
అసురగుణం నల్లన
కాటుకేంతో నల్లన
కాలుడేంతో నల్లన 


ఎరుపు


మందారం ఎరుపు
మన రక్తం ఎరుపు 
సూర్యొదయం  ఎరుపు
సంధ్య రూపు ఎరుపు 


ఆరోగ్యం 


పరిసరాల నెప్పుడు 
పరిశుభ్రం గుంచుకో
రోగాలు దరికి ఎపుడు 
రాకుండ్ చూచుకో 


చెత్త చెదార మంత చేర్చి
ఎత్తి కుప్ప నందు కాల్చు 
తోటివారు కూడ ఎపుడు 
పాటించ వలె శుభ్రత 


తరగతంతా శుచిగయున్న
తరగకుండు ఆరోగ్యం 
ఎచట మురికి యుండునో 
నచట దోమలుం డును 


ఎచట ఎంగిలుం డునొ
నచట ఈగ మూగును
దోమలోద్దు ఈగలోద్దు
మురికి వద్దు ఎంగిలోద్దు


మనం చదివే బడులెపుడు
దేవుడుం డే గుడులు కాదె 
దానం గల్గి నొడికన్న
ఘనుడా రోగ్య వంతుడు 

**********          **********

మూడు కోతులు 


మంచి పలికే తందుకే
మనకు నోరున్నది 
చెడును చెప్పి నోటిని 
పాడు చేయ కెపుడు 

శుభం వినెతందుకు 
చెవుల మన కున్నవి
అశుభం విని చెవులలో 
కసువు కోరి పెంచకు 


ఉన్న మంచి చూడను 
కనులు మనకున్నవి 
ఎన్నడైనా చెడును చూడ 
కనుల నాసలె నుమ్చకు 


నోరు చెవి కనులతో 
పెరుమేరి తెచ్చుకో 
మూడు మర్కటాల కథ 
మురిసి చెప్పే గాంధీ తాత

*********          **********


ఏంది


గాంధీ మన జాతిపిత 
ఖాదీ మన జాతికి ప్రీతి 
బూందీ ఒక తిను బండారం 
బ్రాంది ఒక చేదు పనిఇయం 
ఏంది మన తెలుగునా యాస 
హిందీ మన దేశపు భాష 

**********          **********

చదువుల తల్లి 

అక్షర జ్యోతి వెలిగించు 
రక్షణ జాతికి కలిగిం చు 
విజ్ఞాన కళిక రగిలించి 
అజ్ఞాన చీకటి తొలగించు 
పలకా బలపం పట్టి నేర్చుకో 
పడుచు ముసలి భేద మెంచుకో 
చదువుల తల్లి మీ వెంట 
సేద తీరాలి మీ ఇంట

**********          **********

సామెతలు


నేరు కాగాక వర్షం రాదు 
గింజ నాక పంట పండదు 
గుమ్మడి నాటిన మామిడి కాయదు 
చదవ కున్నాను విద్య దక్కదు 
కష్ట పడకనే ఫలితం దక్కదు 


**********           ***********


దేవుడెక్కడ 


గుడిలో ములన మదిలో నున్న 
మంత్ర తంత్రము మాటి మాటికి 
జపము చేసేది జాతి మనిషిని 
దేవుడెక్కడ చుపమంటు 


దండ మేటి నడిగెను బాలుడు 
నొక్కి నొక్కి బాలడు నడగగా 
స్రుక్కి పోయేన పూజారి 


బడిలో బాలుర మేధ్యన చేరి 
బోధనా చేసే గురువుని చేరి 
పట్టు వదలక నిట్టె బాలుడు 
దేవుడెక్కడ  చూప మంటూ 
దండం పెట్టి బాలుదదగగా 


ఒక్క మెతుకు తినక పొయినా 
డొక్కా లంతుకు పోయి వున్నను
బుజ్జి పాపకు పాలను యిచ్చే 
అమ్మ చూపులో చూడుము దేవుని

**********           ***********


దేవుడిల్లు


మా ఇంటి సందు చివర 
ముసలి ఒకడు మరణించ 
వురువడ అంత చేరే 
ఇసుక వేస్తే రాల కుండ 


అంత మంది  గుమికూడా 
ఆశర్యం బాలకునికి 
అమ్మ చీర చేగు పట్టి 
అనుమానం తోడురాగా 


బాలుడడిగే అమ్మను 
అసలు మనకు కానరాడు 
చెప్పు అమ్మ నిజం చెప్పు 
ఎదకేల్లి పోయినాడు?


దేవుదిమ్తి కేల్లెనా? 
దయ్యమింటి కేల్లెనా?
అంత మంది చేరి రంటే?
అనుమానం నీకెందుకు 
ముసలివాడు తప్పక 
ముక్తినోమ్డే చెప్పక 

**********           **********


పొదుపు

పొదుపు గూర్చి అమ్మ ఎపుడు 
పోడుపు కథలు చెప్పు నెపుడు 
అదుపు తప్పి ఖర్చు  వలదు 
ముందు ఏంటో వ్రతుకు కలదు 


చినుకు చినుకు ఒక్కటై 
చేరు వంతా నిండి పోవు 
మాట మాట ఒక్కటై
మహా గ్రంధ మొకటి వెలయు 


అన్న మాట గుర్తు కొచ్చి 
అమ్మ మాట తీర్చ నెంచి 
చాకు లెట్లు చ్రు తిండ్లు 
ఏకంగా మాను కుంటి


అమ్మ యిచ్చిన డబ్బులు 
అసలు ఖర్చు చేయకుండా 
అమ్మ చెప్పినట్లుగా 
సొమ్ము చేయ నెంచితి 


పైసా పైసా ఒక్కటై 
పదులు వేలుగా మేరిపోయే 
కిద్ది బ్యాంకు లో దానం 
వడ్డీ తో పెరిగే నిజం 


ఒరుల సాయం లేకుండా 
వచ్చి చేరే సోమ్మేంతో 
చిన్న చిన్న చురు కోర్కెలు 
స్వయంగా నే తీరిపోయే 

**********           **********

చదువు 

బ్రతుకు నేర్పు నన్నది చదువు ఒక్కటే 
చదువు లేక పొతే నివు పశువు వొక్కటే 


సహనమేమ్తో అబ్బును చదువు గల్గిన 
సరస మెంతో తోడగు చదువు నీర్చిన 


కోప తాప మంట చదువు కూడ దనును గా 
కానీ గుణము లన్ని యిట్టే త్రోసి వేయిగా 


మనిషి యనగా నర్ధమే మనకు తెల్పును 
మానవతా విలువ లెన్నో గూడా బెట్టునే 


మనము బ్రతుకు తోక్కటే గొప్ప కాదను 
తోటివారి మేలు కోరే బుడ్డి నిల్పును 


సమ్పూర్న మూర్తిత్వం చదువు నేర్ప కున్నచో 
లోక వంచనమ్ము కాక చదువు లెందుకు 

**********          **********


సునామీ


అర్థరాత్రి మా యింట్లో 
ఆద మార్చే మొద్దు నిద్దట్లో 
నిద్ర వచ్చి ఆవులించే
గాఢ నిద్ర లోన ఇల్లు 


గుర్రు పెట్టి కలవరిల్ల 
మెలకువచ్చి బుజ్జిగాడు 
పలుకు వారొకరు లేక 
బావురుమని ఎడ్వసాగే

నిద్ర చెడి అందరమూ 
ఆగ్రహంగా కేకలేయ 
తలుపు నెవరో తట్టి నట్లు 
గోల్లెమేమ్తో గోలపెట్ట 


తలుపు తెరిచి చూడ బోగా
భళ్ళుమని నీరు చోరగ 
భయము తోడ కేక లేస్తూ
పరుగున మే మెరక ఎక్క 


బ్రతికి బయట పడితి మెంటే 
బుజ్జిగాడి పుణ్యమే 
సులువుగా మేమంతా 
సునామీని జయించితిమి

*********           **********

ఏకత్వం 


సురుడోక్కడే చంద్రు డొక్కడే 
అలుకు బెళుకుల తారలెన్నో 
అన్ని చేరగా నా అందమైన 
ఆకాశాన్ని అరసి చూడుమా 


భూమి ఒక్కటే నిరు ఒక్కటే 
చెట్లూ చేమలు జిఇవులెన్నో 
అన్ని కలసిన అవని చూడుమా 
ముచ్చ టౌనుగాముదము హెచ్చగా 


ఈ దేశమో క్కటే  ఈ  జాతి ఒక్కటే
మా కులాలెన్నో మా మాటలెన్నో 
మాభాశాలెన్నో వేశాలెన్నో 
భిన్నమినాను భారతీయులం 


అన్ని చదువుల సారమొక్కటే 
అన్ని మతముల బోధనోక్కటే 
దేవుడొక్కడే ప్రేమ ఒక్కటే 
నీవు వ్హేప్పుమా ఆ నిజం ఎప్పుడు


భిన్నము లెన్నో వున్న వారము 
ఎన్ని వున్నను మేమేక రూపము 
స్వర్గ మైనను సాటి తదుర 
భారత భూమికి దీటు లేదుర

**********           **********


అసూయ


తమ్ముడు పుట్టినంత 
తరిగిపోయే ప్రేమ సుంత
నన్ను ఎత్తుకోనుత మని 
చిన్న వాడ్ని ఎత్తుకుంటే 


పెద్దనైన నన్ను జూచి
సర్ది చెప్పు మాట మరచి 
పసివాడినని గురుతుపోయి 
నసపెట్టిగా విసిగి పోయి 


అలవాటుకాని పనులు 
అదలించి చెబుతుంటే
చిన్న వాడితో నన్ను పోల్చి 
చిర్రు బుర్రు లాడుతుంటే 

వానివలె కుదురు లేదు 
వాదులాటే నేకపుడు 
నీకంటే చిన్న వాడు 
వాడ్ని చూచి నేర్వమంటే


ఓర్వలేని తనం బలిసి 
ఈర్ష్య గుణం తోడూ కలిసి 
అసుయగానాలో నిండి 
వసివాడి  పోతుంది గుండె 


బాలలలో అసుయకు 
భాదులేవారు పెద్దలే 
అనుగున్యతతో బుజ్జగించి 
ఆదరంగా పలికి నమ 


ఆనందమే మా బాల్యం 
అసుయకే తావు శూన్యం 


**********           **********


భయం 


భయమంటూ లేదుగా 
మా కెపుడు నిజంగా 
అమ్మ మాకు చెప్పు దసలు
బుఉచోది కథలు ఎపుడు 


పిల్లి మేక కుక్కలను 
ప్రేమతోడ తాను పట్టి 
తాక మంటు మమ్ముల 
బుజ్జగించి చెప్పును 


నీరంటే మాకు భయం
లేకుండా పారద్రోల 
చెరువులలో జలక మాడ 
చేరదీసి నాన్న ఈతనేర్పు 


సాహస కథలలో మనం 
చరిత్ర్ కెక్కాలి మనం 
సాహస బాల బాలికలనే
స్వేచ్చ భారతి కోరుతుంది 

(సమాప్తం )




















ti











3 comments:

  1. pulavarthi gaari baala geyaalu baagunnayi. pillalaku chakkagaa artham avutaayi . kavi gaariki ,meeku abhinamdanalu

    ReplyDelete
  2. pillala kosam blaagu chala bagundi

    ReplyDelete
  3. రమేష్ బాబు గారు నమస్తే! మీ ఈ బాలకళ.. బ్లాగ్ చాలా బావుంది.. ప్రత్యేకముగా, మాస్టారు పులవర్తి కోర్నేలియస్గా గారి "మావూరు" కవిత చాలానచ్చింది..

    ReplyDelete