Thursday, April 8, 2010

శ్రీ గాదిరాజు రంగరాజు పంపిన బాల సృజనలు

పశ్చిమ గోదావరి జిల్లా ,ఉండి మండలం, కొత్తపేట మండల పరిషద్ 
ప్రాధమిక పాటశాల చిన్నారులను ప్రోత్సహించి
శ్రీ   గాదిరాజు రంగరాజు   పంపిన బాల సృజనలు




కుక్క


-బి. ఉదయ శ్రీ తేజ ,5  వ తరగతి


మా ఇంట్లో ఉండి ఒక కుక్క
దానికి కొంచెం తిక్క
వేసాను బిస్కెట్టు ముక్క
పట్టింది నా పిక్క
కారింది రక్తపు చుక్క
వేసుకున్నాను టాబ్లెట్ ముక్క

*********          **********


తేనెపట్టు


-ఇ.సాయి రేఖ ,5 వ తరగతి


అదిగో జువ్వి చెట్టు
పట్టింది తేనెపట్టు
గురి చూసి దాన్ని కొట్టు
తేనెటీగ నిన్ను కుట్టు


*********          ***********


వంట


-ఎ.గోపి కృష్ణ ,5 వ తరగతి


మా వురి వంట
నోరంతా మంట
తినక పొతే తంట
తింటే నా కంట
బాత్రుమే గతంట


***********          *************


స్నేహం


-ఎం. దీపిక ,5 వ తరగతి


స్నేహం పుట్టేది విత్తనం లా
పెరిగేది మొక్కలా
పూసేది పువ్వులా
కలిసుండేది హారంలా
ఓ నందన వనంలా


************          ************


జైలు పాల్


-ఎస్. రమ్య,5 వ తరగతి


నా పేరు పాల్
నేను చేసాను పాపాల్
మా నాన్న పేరు గోపాల్
మా ఇద్దరికీ వున్నాయి శాపాల్
అందుకే అయ్యాము జైలు పాల్

************           *************

లొల్లి


-ఎస్. రమ్య, 5 వ తరగతి


నా పేరు మల్లి
నాకు ఇష్టం చెల్లి
దాని పేరు వల్లి
అది రోజు స్కూలు కు వెళ్లి
చెబుతుంది లొల్లి

************           *************

జో ష్


-ఎం. భవాని,5 వ తరగతి


నా పేరు వ్యాస్
మా నాన్న పేరు బోస్
నేను రోజు చూస్తాను న్యూస్
నా కు ఇష్టమైన సినిమా జో ష్

***********          ***************

హెలి కాప్టార్ కామెడి


-సేకరణ ,ఎం. హర్ష వర్ధన్ ,5వ తరగతి


ముఖ్య మంత్రి రోశయ్య ,ప్రతి పక్ష నాయకుడు చంద్ర బాబు నాయుడు హెలికాప్టర్ లో ప్రయాణం చేస్తూ ఇలా సంభాషిస్తున్నారు


చంద్ర బాబు నాయుడు :  నేను చిటికేస్తే నా కలి దగ్గర వేయి మంది జనం పడతారు.


రోశయ్య  : నేను చిటికేస్తే నా కలి దగ్గర నాలుగు వేల మంది పడతారు.


పైలెట్   : నేను బ్రేక్ వేస్తే మన ముగ్గురం కలసి ఎక్కడో పడతాం

*************           ************



ఆశయం


-కోరాడ నరేష్ ,5వ తరగతి


మొక్కలు                   నాటేస్తాను
పచ్చ దాన్నాన్ని          పెంచేస్తాను
కాలుష్యాన్ని                తరిమేస్తాను
ఆరోగ్యాని                     కాపాడుతాను
ఆనందంగా                  నేనుంటాను
నా ఆశయాన్ని             నెరవేరుస్తాను
అందరు బాగుండాలని    ఆశిస్తాను

*************          **************


కవిత రాత


-కోరాడ నరేష్ బాబు,5 వ  తరగతి


నా పేరు సీత
నా ఫ్రెండ్ గీత
పట్టాను పీత
పెట్టాను మేత
కోసాను కోత
మారింది దాని రాత

*************          ************


క్కలు


-జరుగుల గోపి,5 వ తరగతి


కొన్నాను వక్కలు
చేశాను చెక్కలు
నమిలాను ముక్కలు
చూసాను చుక్కలు
అయ్యాయి నా పళ్ళు 'క్కలు'


***********          ************


దిన కృత్యం


-లంక కావ్య, 5 వ తరగతి


పొద్దున్న నేను లేస్తాను
చక్కంగా స్నానం చేస్తాను
చక చక బడికి పోతాను
టక టక పాఠాలు చదువుతాను
అల్లరి అసలే చేయను
బుడ్డిగ నేనుంటాను
అందరితో స్నేహం గా వుంటాను
గురువుల మెప్పు పొందుతాను

**********          **********

1 comment: